iDreamPost

ఎప్పుడో వదిలేసిన తండ్రి.. ఇంటికి వస్తున్నానని చెప్పడంతో పొంగిపోయిన కూతుళ్లు.. కానీ

మొదటి భార్య చనిపోవడంతో.. వెంటనే మరో పెళ్లి చేసుకుని వేరో కాపురం పెట్టాడు కొడుకు. మొదటి భార్యకు పుట్టిన పిల్లల బాధ్యతలను కూడా చూస్తుంది తల్లీ. తండ్రి అప్పుడప్పుడు ఫోనులో పలకరించేవాడు. తాజాగా ఇంటికి వస్తున్నాడని తెలిసి సంబరపడిపోయారు కూతుళ్లు.

మొదటి భార్య చనిపోవడంతో.. వెంటనే మరో పెళ్లి చేసుకుని వేరో కాపురం పెట్టాడు కొడుకు. మొదటి భార్యకు పుట్టిన పిల్లల బాధ్యతలను కూడా చూస్తుంది తల్లీ. తండ్రి అప్పుడప్పుడు ఫోనులో పలకరించేవాడు. తాజాగా ఇంటికి వస్తున్నాడని తెలిసి సంబరపడిపోయారు కూతుళ్లు.

ఎప్పుడో వదిలేసిన తండ్రి.. ఇంటికి వస్తున్నానని చెప్పడంతో పొంగిపోయిన కూతుళ్లు.. కానీ

నేటి కాలంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తల్లిదండ్రులు-బిడ్డలు, అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు, భార్యా భర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి ఆస్తి, అంతస్థుల తగాదాలు. వీటి కోసం కుటుంబ సభ్యులను మట్టుబెడుతున్నారు. తాజాగా ఓ కసాయి కొడుకు తనకు బిడ్డనిచ్చిన తల్లిని, తాను జన్మనిచ్చిన కూతుళ్లను హత్య చేసిన దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోపాలపేటలో నివాసముంటున్న పిట్టల వెంకటేశ్వర్లుకు గతంలో ఓ పెళ్లి జరగ్గా.. ఇద్దరు పిల్లలు కలిగారు. భార్య కనకదుర్గ చనిపోవడంతో కొద్దీ రోజులకే త్రివేణి అనే మరో మహిళను వివాహం చేసుకుని ఊరి నుండి వెళ్లిపోవడంతో ఆ పిల్లల బాధ్యతను దివ్యాంగురాలైన అతడి తల్లి పిచ్చమ్మ చూస్తుంది.

ఈ క్రమంలో ఆ పిల్లల బాధ్యతను భుజాన వేసుకున్న పిచ్చమ్మ.. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని, ఎకరం పది గుంటల పొలంలో సగం ఇద్దరు పిల్లలకు దక్కేలా పెద్దల సమక్షంలో వీలు రాసింది. తనకొచ్చే పింఛను, రైతు బంధుతో జీవనం సాగిస్తోంది. కాగా, వెంకటేశ్వర్లు కూతుళ్లు నీరజ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇటీవలే నాలుగో తరగతి పూర్తి చేయగా.. ఐదో తరగతికి కల్లూరులోని గురుకుల పాఠశాలలో సీటు రావడంతో చేరింది. ఝాన్సీ అంగన్‌వాడీ విద్య పూర్తి చేసింది. అయితే డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు చెడు అలవాట్లకు లోనయ్యాడు. దీంతో అప్పులు పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేందుకు తల్లి ఆస్తిపై కన్నేశాడు. తల్లి పిచ్చమ్మ పేరున ఉన్న దాదాపు అరెకరం పొలాన్ని అమ్మాలంటూ ఆమెతో గొడవ పడేవాడు. అయితే మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించి.. వాటిని అమ్మనంటూ తెగేసి చెప్పింది.

దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు కొడుకు వెంకటేశ్వర్లు. శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో తల్లి పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి అమ్మకు ఫోన్ ఇవ్వమని చెప్పి.. తాను అక్కడకు వస్తున్నానని సమాచారం అందించాడు. తండ్రి వస్తున్నాడని తెలిసి.. కూతుళ్లు ఎంతో సంతోషించారు. కానీ శనివారం పిచ్చమ్మ కానీ, ఆ పిల్లలు బయటకు రాకపోవడం.. ఎలాంటి అలికిడి లేకపోవడంతో.. స్థానికులు వెళ్లి చూడగా.. పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీలు విగతజీవులుగా కనిపించారు. ముగ్గురు హత్యకు గురయ్యారని గుర్తించారు. గొంతు, ముఖం, శరీర భాగాలపై గాయాలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసమే ఈ ముగ్గుర్ని చంపి.. వెంకటేశ్వర్లు పరారైనట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెంకటేశ్వర్లు బావమరిది, కనకదుర్గ సోదరుడు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి