iDreamPost
android-app
ios-app

మద్యం మత్తులో తండ్రి దారుణం.. కన్న కూతుళ్లను!

  • Published Sep 07, 2023 | 12:07 PM Updated Updated Sep 07, 2023 | 12:07 PM
  • Published Sep 07, 2023 | 12:07 PMUpdated Sep 07, 2023 | 12:07 PM
మద్యం మత్తులో తండ్రి దారుణం.. కన్న కూతుళ్లను!

కేరళలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టాడు. తన ముగ్గురు మైనర్ కూతుళ్లను గొంతు కోశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఆ తండ్రి కన్నకూతుళ్లను ఎందుకు హత్య చేశాడు? ముగ్గురు మైనర్ బాలికలు చనిపోయారా? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కేరళ కొట్టాయం జిల్లా రామపురం గ్రామంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్ల సంతానం. అయితే భర్త తాగుడుకు బానిసై తరుచు భార్యను వేధించేవాడు. ఇక భర్త టార్చర్ ను భరించలేని ఆ మహిళ.. గతేడాది కూతుళ్లను భర్త వద్దే వదిలి పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి అతడు తన ముగ్గురు కూతుళ్లను చూసుకుంటూ వచ్చాడు. అయితే.., భార్య వదిలి వెళ్లిపోవడంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రోజూ మద్యం తాగుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే.. ఇతడు ఎప్పటిలాగే ఇటీవల కూడా మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

ఇక మత్తులో ఉన్న అతడు అదే రాత్రి తన ముగ్గురు మైనర్ కూతుళ్లను కత్తితో గొంతు కోసి దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ ముగ్గురు పిల్లలను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అయితే చిన్న కూతురు పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom