iDreamPost
android-app
ios-app

పట్టపగలు దారుణం.. మేకప్ కోసం వచ్చి ఎంతకు తెగించారంటే?

పట్టపగలు దారుణం.. మేకప్ కోసం వచ్చి ఎంతకు తెగించారంటే?

మంగళవారం ముగ్గురు మహిళలు మేకప్ కోసమని చెప్పి ఓ బ్యూటీపార్లర్ కు వెళ్లారు. ఏం తెలియనట్టుగా అందులో ఉన్న బ్యూటీషియన్ తో ముచ్చట్లు పెట్టారు. ఇక ఉన్నట్టుండి ఆ ముగ్గురు మహిళలు చేసిన పనికి బ్యూటిషియన్ తో పాటు అందరూ షాక్ గురయ్యారు. వాళ్లు చేసిన దానికి ఆ బ్యూటిషియన్ ఒక్కసారిగా అరిచింది. ఇక స్థానికులు అంతా పరుగు పరుగున వచ్చి చూసే సరికి జరగాల్సింది అంతా జరిగిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ ముగ్గురు మహిళలు ఏం చేశారు? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలులో కృష్ణా నగర్ లో స్థానికంగా నివాసం ఉండే రజియా అనే మహిళ బ్యూటీపార్లర్ ను నడిపిస్తున్నారు. అయితే మంగళవారం ముగ్గురు మహిళలు మేకప్ కోసం అని చెప్పి రజియా బ్యూటీపార్లర్ లోకి వెళ్లారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఇదే సమయంలో రజియా ఒంటిపై ఉన్న దాదాపు 20 సవర్ల బంగారు అభరణాలపై కన్నేశారు. వీరి పథకం ప్రకారమే.. ఉన్నట్టుండి బ్యూటీషియన్ ముఖంపై యాసిడ్ తో దాడి చేశారు. ఇదే కాకుండా ఆమెపై మత్తు మందు కూడా చల్లారు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు అభరణాలు, కౌంటర్ లో ఉన్న రూ.40 వేల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే వీరి దాడిలో బాధితురాలు రిజియా తీవ్రంగా గాయపడి ఒక్కసారిగా అరిచింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమె షాపులోకి వెళ్లిచూడగా.. అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రజియా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పట్టపగలు బరితెగించిన ముగ్గురు మహిళల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet