జీవితంపై విరక్తి చెంది.. కేరళనుంచి విశాఖ వచ్చి..

జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆ యువతి కలలు కంది. తనకు ఎంతో ఇష్టమైన ఎంబీబీఎస్‌ చదవటానికి అన్ని రకాలుగా ప్రిపేర్‌ అయింది. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్‌ చదవటానికి చైనా కూడా వెళ్లబోతోంది. ఇలాంటి ఈ సమయంలో ఆ యువతి అనుకోని నిర్ణయం తీసుకుంది. ఏమైందో ఏమో కానీ, జీవితంపైనే విరక్తి తెచ్చుకుంది. కేరళకు చెందిన ఆ యువతి రాష్ట్రానికి దూరంగా.. వైజాగ్‌ వచ్చింది. అక్కడ లాడ్జీలో రూము తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా, వందనపల్లికి చెందిన రమేష్‌ కృష్ణ అనే యువతి ఇంటర్‌ పూర్తి చేసింది.

డాక్టర్‌ అవ్వాలన్నది ఆమె కల. ఇందుకోసం చైనాలో ఎంబీబీఎస్‌ చేయటానికి సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో ఆమె చైనా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రమేష్‌ కృష్ణ ఈ నెల 23న కేరళనుంచి వైజాగ్‌కు వచ్చింది. వైజాగ్‌లోని ఓ లాడ్జీలో రూము తీసుకుంది. మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె మరుసటి రోజు కూడా బయటకు రాలేదు. దీంతో లాడ్జీ సిబ్బంది​కి అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఉంటున్న గది తలుపులు తీశారు. లోపల రమేష్‌ కృష్ణ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆ దృశ్యంతో ఒక్కసారిగా షాక్‌ అయిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో ఓ లేఖను  వారు గుర్తించారు. ఆ లేఖలో తన చావుకు ఎవరూ కారణం కాదని.. జీవితం మీద విరక్తితోటే చనిపోతున్నట్లు ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి కేరళనుంచి వచ్చి ఎందుకు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్యకు కారణం ఏంటన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments