iDreamPost
android-app
ios-app

తల్లి కాదు కదా కనీసం మనిషి కూడా కాదు.. మూడేళ్ల చిన్నారిపై

  • Published May 21, 2024 | 8:04 AM Updated Updated May 21, 2024 | 8:04 AM

నిండా మూడేళ్లు కూడా లేని పసిబిడ్డ మీద తన దాష్టీకం చూపించింది ఓ మహిళ. చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ వివరాలు..

నిండా మూడేళ్లు కూడా లేని పసిబిడ్డ మీద తన దాష్టీకం చూపించింది ఓ మహిళ. చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. ఆ వివరాలు..

  • Published May 21, 2024 | 8:04 AMUpdated May 21, 2024 | 8:04 AM
తల్లి కాదు కదా కనీసం మనిషి కూడా కాదు.. మూడేళ్ల చిన్నారిపై

తల్లి అంటే ఎనలేని అనురాగానికి ప్రతీక. ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తి ఉంటుందని అంటారు. కనకపోయినా సరే.. తనలోని అమ్మతనం ఎవరినైనా దగ్గర తీస్తుందని.. ప్రేమను పంచుతుందని చెబుతారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను చూస్తే.. ప్రతి ఒక్కరి మనసు స్పందిస్తుంది. వారి బోసి నవ్వులు.. ఎంతటి కఠినాత్ములనైనా మార్చేస్తాయి. కానీ కొందరు స్త్రీల తీరు చూస్తే.. వీళ్లు మనుషులు రాక్షసులా అనిపించక మానదు. ఇక పైన ఫొటోలో కనిస్తిన్న మహిళ కూడా ఇలానే రాక్షస జాతికి చెందిన స్త్రీనే. తనను నమ్మి ఓ పసిబిడ్డ బాగోగులు చూసుకోమని చెబితే.. అత్యంత దారుణంగా ఆ చిన్నారిని హింసించి చంపేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

తల్లిలేని పసిబిడ్డను కన్నతల్లిలా ఆదరించాల్సిన సవతి తల్లి.. ఆ బిడ్డ ప్రాణాలు బలి తీసుకుంది. ఈ దారుణం కర్ణాటకలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెళగావి జిల్లా కంగ్రాళి గ్రామానికి చెందిన రాయణ్ణ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఇతడికి వివాహం అయ్యింది. ఓ కుమార్తె కూడా జన్మించింది. చిన్నారి వయసు 3 సంవత్సరాలు. అయితే దురదృష్టవశాత్తు.. రాయణ్ణ భార్య మృతి చెందింది. అతడు పని చేసేది ఆర్మీలో.. దాంతో ఇంటి పట్టున ఉండే అవకాశం లేదు. పాపను చూసుకోవడం కోసమైన మరో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల బలవంతం చేశారు. దాంతో అతడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.

ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం అతడికి సప్నా అనే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత.. రాయణ్ణ డ్యూటీకి వెళ్లాడు. ఇక తల్లి లేని బిడ్డను కన్నతల్లిలా చూసుకోవాల్సింది పోయి.. చిత్ర హింసలకు గురి చేసింది సప్నా. రాయణ్ణకు వేరే రాష్ట్రంలో ఉద్యోగం కావడంతో.. అతడికి సప్నా రాక్షస చేష్టలు గురించి తెలియలేదు. పాపను చూసుకుంటూ ఇంటి వద్దే ఉన్న సప్నా.. పనిదాన్ని చిత్ర హింసలకు గురి చేసింది. మూడేళ్ల చిన్నారిపై తన ఈర్ష, ద్వేషాలు ప్రదర్శించింది. చిన్నారిని పట్టించుకునేది కాదు. ఏడిస్తే.. చితకబాదేది. ఈ క్రమంలో సోమవారం నాడు కూడా పాపను తీవ్రంగా కొట్టి హింసించింది సప్నా. ఈ దాడిలో ఆ చిట్టితల్లి మృతి చెందింది. పాప చనిపోవడంతో కొత్త నాటకానికి తెర తీసింది సప్నా.

పాపను చిత్ర హింసలకు గురి చేసి చంపిన సప్నా.. ఆ తర్వాత ఏం తెలియని అమాయకురాలిలా.. భర్తకు కాల్‌ చేసి.. అనారోగ్యంతో పాప చనిపోయిందంటూ డ్రామా ప్రారంభించింది. వాంతులు చేసుకుని చిన్నారి మృతి చెందింది అని తెలిపింది. కానీ సప్నా తీరు తెలిసిన చిన్నారి అవ్వా, తాతలు.. ఆమె మీద అనుమానం అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా.. సప్నా దాష్టీకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.