మగాళ్లకే కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వగలాడి మోసం! ఎంతకు తెగించిందంటే?

మగాళ్లకే కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ వగలాడి మోసం! ఎంతకు తెగించిందంటే?

పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు భవిక బోయిర్. చూడచక్కని అందంతో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునేలా ఉంది. ఇంతకు ఈమె ఎవరు? అసలు ఇప్పుడు ఈమె గురించి ఎందుకనే కదా మీ ప్రశ్న. కానీ, ఈ వగలాడి చేసిన మోసం తెలుసుకుంటే మాత్రం మీరు అస్సలు నమ్మలేరు. ఈమె చేసిన దారుణానికి ఏకంగా మగాళ్లే కన్నీళ్లు పెడుతున్నారు. చూడటానికి ఇంత అందంగా ఉన్న ఈ మహిళ చేసిన మోసం ఏంటి? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని షాపూర్ ప్రాంతంలో శివ్ భగత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో శివ్ భగత్ కు భవిక బోయిర్ అనే అమ్మాయి పరిచయం ఉంది. చూడటానికి కాస్త అందంగా ఉండడంతో మనోడు కాస్త ఆ యువతితో ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆ యువతికి కూడా చెప్పాడు. ఈమె మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో శివ్ భగత్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఇక ఇంకేముంది.. శివ్ భగత్ ఎంచక్కా ఈ యువతితో రోజూ ఫోన్ లో మాట్లాడుతూ ప్రేమ విహారంలో తేలియాడాడు. ఈ యువతి కూడా ఇతనిని బాగానే ప్రేమిస్తున్నట్లు నటించింది. శివ్ భగత్ మాత్రం ఈ అమ్మాయి కోసం పిచ్చోడిలా మారిపోయాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల నిన్ను ఓ చోట కలవాలని, అక్కడికి రావాలని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. మనోడు కాస్త ఎగ్జైట్ మెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇక వెళ్లేటప్పుడు తన ప్రియురాలికి బంగారు రింగ్స్ తో పాటు కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్లాడు. ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. ఇద్దరు కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు వస్తు వస్తూనే శివ్ భగత్ పై దాడి చేశారు. భవిక వెంటనే శివ్ భగత్ వద్ద ఉన్న బంగారు నగలు, విలువైన వస్తువులను లాగేసుకుంది. శివ్ భగత్ అప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయి ప్రేమించింది నన్ను కాదు, నా డబ్బును అని. ఇక ఇంతే కాకుండా ఆ యువకులు అతని ఒంటిపై దుస్తువులు విప్పి తీవ్రంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ రోజు రాత్రంతా శివ్ భగత్ అక్కడే ఉండిపోయాడు.

మరుసటి రోజు ఉదయం పెట్రోలింగ్ పోలీసులు అతడిని గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక రెండు రోజుల తర్వాత అతడు కోలుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు ఏం జరిగిందంటూ శివ్ భగత్ ని ప్రశ్నించారు. అతడు పోలీసులకు వివరిస్తూ.. నేను భవిక బోయిర్ అనే అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను. ఆమె కోసం ఇప్పటికీ లక్షలు ఖర్చు చేశాను. ఆ యువతి కోసం ఓ ఇల్లు కూడా కట్టించాను. కానీ, చివరికి ఆ అమ్మాయి మాత్రం మరో యువకుడి కోసం నన్ను దారుణంగా మోసం చేసిందంటూ పోలీసుల ముందే అతడు బోరున ఏడ్చాడు. ఇతనికి జరిగిన దారుణంపై పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భవికతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Show comments