కన్నీరు పెట్టిస్తున్న విద్యార్థిని మరణం! అసలేం జరిగిందంటే?

ఈ అమ్మాయికి క్రీడలు అంటే ఎంతో ఇష్టం. అందులో రన్నింగ్ రేస్ అంటే ఇంకా ఇష్టం. ఎక్కడా క్రీడా పోటీలు జరిగినా.. ఈ విద్యార్థిని అందులో పాల్గొనేది. ఇటీవల జరిగిన ఓ పోటీల్లో కూడా ఈ అమ్మయి పాల్గొంది. కానీ, ఉన్నట్టుండి ఈ బాలిక ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే?

ఈ అమ్మాయికి క్రీడలు అంటే ఎంతో ఇష్టం. అందులో రన్నింగ్ రేస్ అంటే ఇంకా ఇష్టం. ఎక్కడా క్రీడా పోటీలు జరిగినా.. ఈ విద్యార్థిని అందులో పాల్గొనేది. ఇటీవల జరిగిన ఓ పోటీల్లో కూడా ఈ అమ్మయి పాల్గొంది. కానీ, ఉన్నట్టుండి ఈ బాలిక ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోయింది. అసలేం జరిగిందంటే?

పైన కనిపిస్తున్న ఈ విద్యార్థిని పేరు నిషా. వయసు 17 ఏళ్లు. పుత్తురులోని ఓ కాలేజీలో చదువుకునేది. అయితే, ఈ బాలికకు క్రీడలు అంటే ఎంతో ఇష్టం. ఎక్కడా పోటీలు జరిగినా ఆమె అందులో పాల్గొనేది. ఇంతే కాకుండా విజయం సాధించి తన సత్తా ఏంటో చూపించాలని ఎప్పుడూ పరి తపించేది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో సైతం నిషా పాల్గొంది. కానీ, ఊహించని పరిణామంతో ఈ విద్యార్థిని ప్రస్తుతం ప్రాణాలతో లేకుండా పోయింది. ఉన్నట్టుండి ఇలా జరగడంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు, ఇతర కటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పుత్తురు పరిధిలోని ఆర్యపు గ్రామం. ఇక్కడే నిషా (17) అనే బాలిక నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి పుత్తురులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకునేది. ఇదిలా ఉంటే.. నిషాకు క్రీడలు అంటే ఎంతో ఇష్టం. అందులో రన్నింగ్ రేస్ అంటే ఇంకా ఇష్టం. ఎక్కడా క్రీడా పోటీలు జరిగినా.. ఈ విద్యార్థిని అందులో పాల్గొనేది. ఇందులో భాగంగానే నిషా.. ఇటీవల బీహార్ లో జరిగిన రన్నింగ్ రేస్ లో సైతం పాల్గొంది. ఎలాగైన బహుమతి సాధించాలనే పట్టుదలతో వెళ్లింది. కానీ, ఆ పరుగు పందెంలో నిషాకు బహుమతి రాలేదు. దీంతో ఈ క్రీడాకారిని తీవ్ర మనస్థాపానికి గురైంది.

అనంతరం అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. రన్నింగ్ రేస్ లో బహుమతి రాకపోవడంతో నిషా తరుచు ఏడుస్తూ కుర్చునేది. తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెకు ధైర్యం చెప్పేవారు. కానీ, నిషా వారి మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. అందులో భాగంగానే నిషా వారం రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై మెరుగైన చికిత్స కోసం మంగుళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో నిషా చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఈ బాలిక మరణంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేవలం బహుమతి పొందని కారణంగానే నిషా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ కంటతడి పెడుతున్నారు.

ఈ బాలిక మరణంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం బహుమతి సాధించలేని కారణంగానే ఆత్మహత్య చేసుకుని నిషా పెద్ద తప్పు చేసిందని, బతికుంటే అలాంటి బహుమతులు అంతకు మించి సాధించేదని కొందరు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతీ చిన్న విషయానికి ఎవరూ ఆత్మహత్య చేసుకోకూడదని, ధైర్యంగా ముందడగు వేసి అనుకున్నది సాధించాలని సూచించారు. పరుగు పందెంలో బహుమతి సాధించలేదని ఆత్మహత్య చేసుకున్న నిషా డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments