Krishna Kowshik
మంచి ఉద్యోగం, అందమైన భార్య. బంగారంలాంటి పిల్లలు. హాయిగా సాగిపోతున్న సంసారంలోకి మరొకరు ఎంట్రీ ఇచ్చారు. అందమైన గూడు ఒక్కసారిగా చెల్లాచెదురుగా మారిపోయింది. దీంతో ఆ మహిళ భర్త కోసం నిరసనకు దిగింది.
మంచి ఉద్యోగం, అందమైన భార్య. బంగారంలాంటి పిల్లలు. హాయిగా సాగిపోతున్న సంసారంలోకి మరొకరు ఎంట్రీ ఇచ్చారు. అందమైన గూడు ఒక్కసారిగా చెల్లాచెదురుగా మారిపోయింది. దీంతో ఆ మహిళ భర్త కోసం నిరసనకు దిగింది.
Krishna Kowshik
శాంతి, భద్రతలను కాపాడుతూ.. ఆపదలో అండగా నిలుస్తుంది పోలీసు వ్యవస్థ. అన్యాయం జరిగిన చోట తామున్నామంటూ భరోసాను కల్పించేది పోలీసులు. చట్టాన్ని, ధర్మాన్ని పరిరక్షిస్తూ.. న్యాయం కోసం బాధితుల తరుఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 24/7 విశ్రమించమని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది ఖాకీలే. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుంటారు. ఎవరికైనా సమస్యలు వస్తే.. తామున్నామంటూ ముందు వరుసలో నిలుచునేది పోలీసులు. రక్షక భటులు అంటే విపరీతమైన గౌరవం ఉంది. కానీ కొంత మంది వల్ల పోలీసు వ్యవస్థపై, ఖాకీలపై నెగిటివిటీ మూటగట్టుకుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన పోలీసే.. వక్రమార్గంలో నిలుస్తూ వార్తల్లో నిలిచాడు.
తనను మోసం చేసి.. మరో మహిళతో జీవిస్తున్నాడని ఓ పోలీసు భార్య నిరసనకు దిగింది. తన భర్త తనకు కావాలని.. పిల్లలతో సహా భార్య మెట్టినింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన సోమవారం కర్ణాటకలోని బళ్లారి నగరంలోని రామ్ నగర యసోజీ కాలనీలో చోటుచేసుకుంది. నగరలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు బోని బనప్ప. అతడికి సౌమ్య అనే యువతితో 2013లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొలు వీరి కాపురం హాయిగా సాగిపోయింది. అతడి జీవితంలో మరో మహిళ వచ్చింది. గత కొన్నేళ్లుగా దావణగెరెకు చెందిన వేరే మహిళతో సహజీవనం స్టార్ట్ చేశాడు. అయితే ఈ విషయం భార్యకు తెలిసి.. అతడ్ని నిలదీసింది. అయినప్పటికీ అతడిలో మార్పు రాకపోగా.. భార్య ముందే ఆమెతో ఫోనులో మాట్లాడటం..పరాయి స్త్రీతోనే ఉంటానని చెప్పడంతో ఖంగుతింది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ పట్టించుకోలేదు పోలీసులు. పూర్తిగా భార్య సౌమ్యను విస్మరించి.. మరో మహిళతోనే ఉంటున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు. డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో.. తనకు అన్యాయం చేసి.. మరో మహిళతో తిరుగుతున్న భర్త కోసం రోడ్డుకెక్కింది. తనకు తన భర్త కావాలంటూ అత్తారింటి ముందు నిరసన చేపట్టింది. బిడ్డలను కూడా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం అయ్యింది. అతడ్ని ఆమె చెర నుండి విడిపించాలని వేడుకుంది. తనకు న్యాయం చేయాలని బోరున విలపించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో.. నిరసన విరమించుకుంది సౌమ్య.