Dharani
Dharani
కర్ణాటక బెళగావిలో డిప్యూటీ తహసీల్దార్.. అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడించారు. సదరు డిప్యూటీ తహసీల్దార్ మృతికి ఆయన భార్యే కారణమని.. పోలీసులు వెల్లడించారు. సదరు తహసీల్దార్ మృతి చెందడానికి ముందు సూసైడ్ నోట్ రాశాడు. అది స్వాధీనం చేసుకున్న పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇంతకు ఏం జరిగింది అంటే.. గత నెల అనగా జూన్ 29 బెళ్గాం సడ్ డివిజినల్ ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తోన్న అశోక్ మన్నికేరి.. గుండెపోటు కారణంగా మృతి చెందాడు.
అయితే అతడి కుటుంబ సభ్యులు మాత్రం అశోక్ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆరోపిస్తూ.. పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారు అశోక్ ఇంట్లో గాలించగా వారికి చనిపోవడానికి ముందు అశోక రాసిన సూసైడ్ నోట్ లభ్యం అయ్యింది. దానిలో అశోక్ సంచలన విషయాలు వెల్లడించాడు.
అశోక్ ఈ సూసైడ్ నోట్‌ను తాను చనిపోవడానికి 9 రోజుల ముందే అనగా.. జూన్ 20న రాశాడు. సూసైడ్ నోట్‌లో ఉన్న దాని ప్రకారం అశోక్, కొన్నేళ్ల క్రితం తన భార్య భూమిని ప్రేమించి.. పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వరకు ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భూమి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. అశోక్ భార్య భూమి, ఆమె తమ్ముడు ఇద్దరు కలిసి అతడిని అనేక విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తుండేవారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు.
వారి వేధింపులు తాళలేకనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని సూసైడ్‌నోట్‌లో రాసుకొచ్చాడు అశోక్. ఇక భార్య వేధింపులు భరించలేక జాబ్ కూడా మానేయాలనుకున్నాడు అశోక్. అందుకోసం వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ.. పై అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా సూసైడ్ నోట్‌తో పాటు లభ్యం అయ్యాయి.సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అశోక్ భార్య భూమి, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే.. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
భూమి చెప్పిన దాని ప్రకారం అశోక్‌కు జూన్ 29న రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చి మరణించాడు అని తెలిపారు. అయితే అశోక్ దగ్గర పని చేసిన ఓ వ్యక్తి మాత్రం.. ఆరోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో అశోక తనకు కాల్ చేశాడని.. కానీ నిద్రలో ఉండంటం వల్ల తాను కాల్ లిఫ్ట్ చేయలేదని తెలిపాడు. తెల్లవారేసరికి అశోక్ బురదలో పడి మృతి చెందాడనే విషయం తెలిసింది అన్నాడు. పోలీసుల దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.