iDreamPost

భర్త మృతి, ఆటో డ్రైవర్ తో పరిచయం! దారుణం ఏంటంటే?

భర్త మృతి, ఆటో డ్రైవర్ తో పరిచయం! దారుణం ఏంటంటే?

రాజమణికి 20 ఏళ్ల కిందట రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుతుళ్లు, ఓ కుమారుడు జన్మించారు. భర్త రేషన్ డీలర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కట్ చేస్తే.. నాలుగేళ్ల కిందట రాజమణి భర్త మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఆమె రేషన్ డీలర్ గా చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఈ సమయంలోనే ఆమెకు స్థానిక ఆటో డ్రైవర్ తో పరిచయం అయినట్లుగా తెలుస్తుంది. అలా కొన్ని రోజుల పాటు అతడు ఆమె ఇంటికి వచ్చిపోయేవాడని సమాచారం. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఊహించని దారుణం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం… ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని పరిధిలోని హనుమాన్ నగర్ లో రాజమణి (37) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. భర్త గతంలో మరణించడంతో అప్పటి నుంచి రేషన్ డీలర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే ఈ క్రమంలోనే రాజమణికి సంతోష్ అనే ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం రాజమణి రేషన్ సరుకులు తీసుకొస్తానని కూతురుకు చెప్పి వెళ్లింది. ఇక ఆ రోజు రాత్రైన రాజమణి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్రమత్తమై స్థానిక ప్రాంతాల్లో వెతకడం మొదలు పెట్టారు. అయితే సంతోష్ మీద అనుమానం రావడంతో ఎరుకుల గూడంలో ఉంటున్న అతని అద్దె ఇంట్లోకి వెళ్లి చూడగా.. రాజమణి తీవ్రంగా గాయపడి శవమై కనిపించింది.

ఆ మహిళను అలా చూసి ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని రాజమణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి