Krishna Kowshik
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటనలో బౌన్సర్ మృతి చెందాడు. రెండు సంవత్సరాల క్రితమే ఇతడికి వివాహం కాగా, సంవత్సరం నిండని చిన్నారి ఉన్నాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటనలో బౌన్సర్ మృతి చెందాడు. రెండు సంవత్సరాల క్రితమే ఇతడికి వివాహం కాగా, సంవత్సరం నిండని చిన్నారి ఉన్నాడు.
Krishna Kowshik
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 రోడ్డు ప్రమాదంలో బౌన్సర్ మృతి చెందిన సంగతి విదితమే. మృతుడు లింగాల తారక్ రామ్‌గా గుర్తించారు పోలీసులు. ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న తారక్..మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లి బుధవారం ఉదయం బైక్ పై జూబ్లీహిల్స్ మీదుగా ఇంటికి వెళుతున్నాడు. పెద్దమ్మ గుడి సమీపంలోని శ్రీ జ్యువెల్లర్స్ మలుపు వద్ద వేగంగా దూసుకు వచ్చిన బ్లాక్ కలర్ కారు అతడి బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తారక్ అక్కడక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక బౌన్సర్ రాజు కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తు చేపట్టారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.
అత్యంత వేగంగా కారును నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో మొత్తం ఐదుగుర్ని అరెస్టు చేయగా.. అందులో ఓ అమ్మాయి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇందులో ప్రధాన నిందితుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని తెలుస్తోంది. రుత్విక్ రెడ్డికి ఇటీవల అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. తన పనిచేసే కంపెనీని చూపిస్తానంటూ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లిన రుత్విక్.. ఆ తర్వాత బార్‌కు తీసుకెళ్లి పార్టీ ఇచ్చాడు. ఫుల్‌గా మద్యం సేవించారు. అదే మత్తులో కంపెనీని చూపించి.. తిరిగి వస్తుండగా.. వీరి వాహనం పెద్దమ్మ గుడి సమీపంలో బైక్‌ను వేగంగా గుద్ది.. అక్కడి నుండి ఆగకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొన్న వేగానికి బైక్.. 20 అడుగుల మేర రోడ్డును రాజుకుంటూ వెళ్లింది.
ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు కాగా, వీటి ఆధారంగా పోలీసులు ఐదుగుర్ని అదుపులోకి తీసుకన్నారు. రుత్విక్, వైష్ణవి, లోకేశ్, అనిఖిత్ నిందితులుగా ఉన్నారు. సురేష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం వీరంతా సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. వారిని విచారిస్తున్నారు. కాగా, తారక్ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో.. అక్కాచెల్లెల్ల బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు. బౌన్సర్‌గా పనిచేస్తూ.. వీరికి పెళ్లి చేశాడు. ఇటీవలే అతడికి వివాహమైంది. అతడికి 11 నెలల చిన్నారి కూడా ఉన్నాడు. మంగళవారం విధులకు హాజరై.. ఇంటికి తిరిగి వస్తుండగా.. రుత్విక్ రెడ్డి, తన స్నేహితులు తప్పతాగి.. వేగంగా కారు నడుపుతూ.. అతడి ప్రాణాలను బలి తీసుకున్నారు. తప్పు చేసిందే కాకుండా.. కారు ఆపకుండా పరారయ్యారు. ఈ ఘటనలో మరో బౌన్సర్ కూడా గాయపడగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తమకు న్యాయం చేయాలంటూ అతడి మృతదేహం వద్ద నిరసన చేపట్టారు కుటుంబ సభ్యులు. నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పడంతో.. నిరసనలు ఆపేశారు.