Venkateswarlu
క్షణికావేశంలో జరిగే చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని కోరుతూ ఉంటాయి. తాజాగా, భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.
క్షణికావేశంలో జరిగే చేసే కొన్ని తప్పులు భారీ మూల్యాన్ని కోరుతూ ఉంటాయి. తాజాగా, భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.
Venkateswarlu
ఈ మధ్య కాలంలో మనుషులు ఏది మంచి, ఏది చెడు అని నిర్థారించుకునే విచక్షణ పూర్తిగా కోల్పోయారు. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పోయి క్షణాకావేశంలో చాలా తప్పులు చేస్తున్నారు. హత్యలకు సైతం పాల్పడుతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సర్ధుకుపోయే తత్వం జనాల్లో బొత్తిగా కరువు అయింది. భార్యాభర్తల గొడవలు కొన్ని సార్లు హత్యలకు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
తాజాగా, ఓ దారుణ సంఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఓ పసికందు ప్రాణం తీసేసింది. భర్తతో గొడవ పడ్డ భార్య.. ఏడుస్తూ విసిగిస్తున్నాడన్న కోపంతో కన్నబిడ్డను చంపేసింది. ఈ సంఘటన జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రం, గిరిదిహ్ జిల్లాకు చెందిన అఫ్సానా ఖాతున్, నిజాముద్ధీన్ భార్యాభర్తలు. వీరికి చాలా కాలం క్రితమే వివాహం అయింది. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టాడు.
పెళ్లయిన కొంత కాలం అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ తర్వాతి నుంచి తరచుగా గొడవలు పడుతూ వస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇద్దరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. గొడవ తర్వాత అఫ్సానా బిడ్డను తీసుకుని గదిలోకి వెళ్లింది. గదిలో తెలిసిన వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఆమెకు చికాకు కలిగించింది. కొద్దిసేపటి తర్వాత క్షణికావేశంలో బిడ్డ గొంతు గట్టిగా నొక్కింది.
బిడ్డ చనిపోయాడు. బిడ్డ చలనం లేకుండా పడి ఉండటంతో ఆమె భర్తను పిలిచింది. తర్వాత బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అప్పటికే బాబు చనిపోయినట్లు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బిడ్డ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అఫ్సానాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో అఫ్సానా కొన్ని విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ..
‘‘ నాకు బిడ్డను చంపే ఉద్ధేశ్యం లేదు. పెద్ద పెట్టున పిల్లాడు ఏడుస్తుంటే కోపం వచ్చింది. ఏడుపు ఎంతకీ ఆపకపోవటంతో మంచంపై నుంచి కిందకు తోసేశాను. బాబు కింద పడి చనిపోయాడు. బాబును చంపాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. ఇదంతా క్షణికావేశంలో జరిగింది’’ అని తెలిపింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి, భర్తతో గొడవ కారణంగా క్షణికావేశంలో బిడ్డను చంపేసిన అఫ్సానా ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.