iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌: ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు! జీడిమెట్లలో ఘటన..

  • Published Sep 01, 2024 | 10:26 AM Updated Updated Sep 01, 2024 | 11:52 AM

Jeedimetla, Hyderabad: జీడిమెట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలైన కనిపించారు. ఫ్యామిలీ మొత్తం మాస్‌ సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Jeedimetla, Hyderabad: జీడిమెట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలైన కనిపించారు. ఫ్యామిలీ మొత్తం మాస్‌ సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Sep 01, 2024 | 10:26 AMUpdated Sep 01, 2024 | 11:52 AM
బ్రేకింగ్‌: ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు! జీడిమెట్లలో ఘటన..

తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఇద్దరు పసిపిల్లల్ని చంపేసి.. ఆ తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదారబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాంలో చోటు చేసుకుంది. సహస్రా రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వారిగా సమాచారం. వెంకటేష్(40), వర్షిణి(33), పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు పోలీసులు. భార్యా ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపే వెంకటేశ్‌ ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్‌ హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిస్తున్నట్లు సమాచారం.

వెంకటేష్ ఆన్ లైన్ బెట్టింగ్స్‌‌తో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంచిర్యాలలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి.. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పడంతో తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకోవడంతో అప్పటికే భార్యభర్తలు పిల్లలు చనిపోయి ఉన్నారు. గాజులరామారం లోని బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్ మెంట్‌లో గత మూడేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. పిల్లలు రిషికాంత్(11) నారాయణ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. మృతుని తండ్రి వాచ్ మాన్‌కి ఉదయం 3 గంటల సమయంలో ‌ఫోన్ చేసి వెంకటేష్ వారిని నిద్ర లేమని చెప్పాడు. వాచ్‌మెన్‌ వెళ్లి వాళ్లను నిద్రలేపేందుకు ప్రయత్నించినా.. వాళ్లు లేవలేదు. తిరిగి 5.30కి వచ్చి తలుపు కొట్టినా లేవకపోవడంతో.. పక్కన ఉండేవారికి విషయం చెప్పడంతో అంతా కలిసి జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చామని వాచ్ మాన్ చెప్పాడు.