iDreamPost
android-app
ios-app

వీడియో: దారుణం..సోషల్ మీడియా స్టార్ ను కాల్చి చంపిన దుండగులు!

  • Published Apr 28, 2024 | 4:25 PM Updated Updated Apr 28, 2024 | 4:25 PM

గతంలో కొందరు సెలబ్రిటీలు, స్టార్లు హత్యకు గురైన  ఘటనలు అనేకం జరిగాయి. కారణాలు ఏమైనప్పటికీ పలువురు స్టార్లు హత్యాగావింప పడ్డారు. తాజాగా ఓ సోషల్ మీడియా స్టార్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి..హత్య చేశాడు.

గతంలో కొందరు సెలబ్రిటీలు, స్టార్లు హత్యకు గురైన  ఘటనలు అనేకం జరిగాయి. కారణాలు ఏమైనప్పటికీ పలువురు స్టార్లు హత్యాగావింప పడ్డారు. తాజాగా ఓ సోషల్ మీడియా స్టార్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి..హత్య చేశాడు.

  • Published Apr 28, 2024 | 4:25 PMUpdated Apr 28, 2024 | 4:25 PM
వీడియో: దారుణం..సోషల్ మీడియా స్టార్ ను కాల్చి చంపిన దుండగులు!

నిత్యం హత్యలకు సంబంధించిన వార్తలు అనేకం సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కారణాలు ఏమైనప్పటికే కొందరు అత్యంత దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఇలాంటి వారిలో సెలబ్రిటీలు సైతం ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా, మరికొందరు దారుణంగా హత్యకు గురయ్యారు. తాజాగా సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఓ లేడీ స్టార్ అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగలు వచ్చి ఆమెపై కాల్పులు  జరిపారు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గతంలో కొందరు సెలబ్రిటీలు, స్టార్లు హత్యకు గురైన  ఘటనలు అనేకం జరిగాయి. కారణాలు ఏమైనప్పటికీ పలువురు స్టార్లు హత్యాగావింప పడ్డారు. అలానే తాజాగా ఇరాక్ దేశంలో దారణం చోటుచేసుకుంది. సోషల్‌ మీడియా స్టార్‌ అయిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురైంది. ఆమెకు సోషల్ మీడియా స్టార్ గా  పేరుంది.  టిక్‌టాక్‌లో ఉమ్‌ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన వీడియోలతో పాటు అనేక ఇతర వీడియోలను చేస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్లను పెంచుకుంది. అయితే ఇటీవలే ఓ కేసులో జైలుకి వెళ్లి.. ఆమె విడుదలై వచ్చింది. ఈ క్రమంలోనే బాగ్దాద్‌లోని ఆమె నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపారు.

ఘఫ్రాన్ సఫాదీ తూర్పు బాగ్దాద్ లోని జయౌనా అనే ప్రాంతంలో నివాసం ఉంటుంది. వివిధ రకాల వీడియోలు చేస్తూ..తన ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.  గతంలో సఫాదీ చేసిన కొన్ని వీడియోలు వివాదాస్పదమయ్యాయి.  ఈ వీడియోలు నైతికత ఉల్లంఘనకు పాల్పడినట్లు ఉన్నాయని ఆమెను అరెస్టు చేశారు. అంతేకాక వివిధ సెక్షన్ల కింద ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. బయటకు వచ్చిన అనంతరం.. పాప్‌ మ్యుజిక్‌కు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే  శుక్రవారం ఆమె హత్యకు గురయ్యారు. ఆమె ఇంటి వద్ద ఈ ఘటన జరిగడం గమన్హారం.

ఓ దుండగుడు బైక్ పై వచ్చి.. కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో నమోదయ్యాయి. అయితే, నిందితుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే గత సెప్టెంబరు 2023లో, మరో ప్రసిద్ధ ఇరాకీ టిక్‌టాక్ యువతి కూడా హత్యకు గురైంది. నూర్ బిఎమ్ అని పిలువబడే నూర్ అల్సఫర్ టిక్ టాక్ స్టార్ బాగ్దాద్‌లో కాల్చి చంపబడ్డింది. అల్సఫర్ ఫ్యాషన్, హెయిర్, మేకప్ వంటి చిన్న వీడియోలను పోస్ట్ చేయడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె తన కొన్ని వీడియోలలో తరచుగా డ్యాన్స్ కూడా చేసింది. ఆమె మరణం జరిగి సంవత్సరం కాకముందే మరో సోషల్ మీడియా స్టార్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobet