iDreamPost
android-app
ios-app

Soumya Shetty: బంగారం చోరీ కేసులో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి అరెస్ట్!

  • Published Feb 27, 2024 | 4:29 PM Updated Updated Feb 27, 2024 | 4:29 PM

ఆమె మామూలు మహిళ కాదూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. షార్ట్ ఫిల్మింస్, సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవాల్సిన సమయంలో.. చేతివాటం ప్రదర్శించి వార్తల్లో నిలిచింది.

ఆమె మామూలు మహిళ కాదూ.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. షార్ట్ ఫిల్మింస్, సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవాల్సిన సమయంలో.. చేతివాటం ప్రదర్శించి వార్తల్లో నిలిచింది.

  • Published Feb 27, 2024 | 4:29 PMUpdated Feb 27, 2024 | 4:29 PM
Soumya Shetty: బంగారం చోరీ కేసులో ఇన్ స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి అరెస్ట్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు.. అవుతున్నారు. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమౌతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ ఈ అమ్మడి రూటే సెపరేట్. నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాలయ్యింది ఓ సెలబ్రిటీ.  తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్, నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి.. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విశాఖ పట్నం పెందుర్తిలో ఈ ఘటన జరిగింది.

ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది సౌమ్య. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివమ్ అనే మూవీ కూడా చేస్తోంది.  జనపలా ప్రసాద్ కుమార్తె, మరో ఇన్ఫ్లయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకుని.. తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి.. గంటలు గంటలు ఉండేది. అలా రెండు మూడు సార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించింది. సుమారు కేజీ బంగారం కొట్టేసింది. అయితే కొన్ని రోజులకు బంగారం కనిపించక పోవడంతో మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సౌమ్యపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ‘మిగిలిన బంగారాన్ని నేను తిరిగి ఇవ్వలేను. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా’ అంటూ బెదిరించిందని తెలుస్తోంది. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ తరలించారు. గతంలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే సౌమ్యకు 2016లో మౌనికతో పరిచయం ఏర్పడింది. 8 ఏళ్లు స్నేహితురాలిగా నటించి.. బాత్రూం పేరుతో వారి ఇంటికి వెళ్లి.. బెడ్రూంలో నగలు కొట్టేసింది. బాధితురాలు గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఈ కిలేడీ లేడి వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య.

 

View this post on Instagram

 

A post shared by Soumya killampalli (@soumyashettysomu23)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet