iDreamPost

ఇంట్లో నుంచి వెళ్ళిపొయిన భార్య అదృశ్యం! ఏమి జరిగిందంటే?

  • Published Jan 30, 2024 | 2:40 PMUpdated Jan 30, 2024 | 2:40 PM

Hyderabad: భార్యాభర్తలు మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు. అంతమాత్రానికే ఆ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంతకు ఏం జరిగిందంటే..

Hyderabad: భార్యాభర్తలు మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు. అంతమాత్రానికే ఆ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published Jan 30, 2024 | 2:40 PMUpdated Jan 30, 2024 | 2:40 PM
ఇంట్లో నుంచి వెళ్ళిపొయిన భార్య అదృశ్యం! ఏమి జరిగిందంటే?

నేటి కాలంలో కొందరు చిన్న చిన్న గొడవలకే చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల బంగారంలాంటి నిండు నూరేళ్ల జీవితం నాశనం అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది కోపంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త మీద కోపంతో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచింది. భార్య చేసిన పనికి భర్త.. తలపట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు..

భర్త మీద కోపంతో.. ఇంటి నుంచి వెళ్లి పోయింది ఓ మహిళ. ఆమె ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. నగరంలోని పుప్పాలగూడలో నివాసం ఉంటున్న బాలకృష్ణకు రెండేళ్ల క్రితం క్రిష్ణప్రియ అనే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లైన దగ్గర నుంచి దంపతులు సంతోషంగానే ఉండేవారు. సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్‌ చేసేవారు. ఇక అందరు భార్యాభర్తల్లానే వీరి మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. తర్వాత అవే సర్దుకునేవి.

ఇలా ఉండగా రెండు రోజుల క్రితం క్రిష్ణప్రియ తన భర్తకు చెప్పుకుండా ఇండి నుంచి బయటకు వెళ్లింది. అయితే పక్కింటికి వెళ్లి ఉంటుందని భావించిన బాలకృష్ణ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోజులానే ఆఫీస్‌కు వెళ్లాడు. అయితే ప్రతి రోజు మధ్యాహ్నం కాల్‌ చేసే భార్య.. ఆ రోజు ఫోన్‌ చేయలేదు. తను కాల్‌ చేస్తే.. స్విచ్ఛాఫ్‌ వస్తుంది. దాంతో అతడికి భయం వేసింది. వెంటనే ఇంటికి వెళ్లి చెక్‌ చేయగా.. క్రిష్ణప్రియ కనిపించలేదు. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. తెలిసిన వారందరిని వాకబు చేశాడు. అందరూ తమకు తెలియదనే చెప్పారు. భార్య ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు బాలకృష్ణ.

దాంతో ఏం చేయాలో అర్థం కాక.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం నుంచి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు తెలిపాడు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారి ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా క్రిష్ణప్రియ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అలాపూ ఆమె కాల్‌ రికార్డ్‌ కూడా చెక్‌ చేస్తున్నారు. కోపంలో క్రిష్ణప్రియ తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబ సభ్యుల చేత కంటతడి పెట్టిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి