iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క పొరపాటే ఈ దంపతులను ప్రాణాలతో లేకుండా చేసింది!

ఆ ఒక్క పొరపాటే ఈ దంపతులను ప్రాణాలతో లేకుండా చేసింది!

పైన కనిపిస్తున్న శ్రీరాములు, స్వప్న దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్ల సంతానం. భర్త స్థానికంగా కిరాణ షాపును నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అలా వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగి పోతూ ఉండేది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతున్న వీరి జీవితంలో ఉన్నట్టుండి ఊహించని ప్రమాదంతో వీరిద్దరు ప్రాణాలతో లేకుండా పోయారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానింగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ముసాపేట్ లోని గూడ్స్ షెడ్ రోడ్డులో శ్రీరాములు యాదవ్ (48)-స్వప్ప (39) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్ల సంతానం. అయితే దివ్యాంగుడైన భర్త శ్రీరాములు స్థానికంగా కిరాణ దుకాణం నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ పోతుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో శ్రీరాములు, అతని తల్లి కిరాణ దుకాణంలో ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు ఆ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది.

అక్కడే పూజ ఆయిల్, చిప్స్ ప్యాకెట్స్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో శ్రీరాములు దివ్యాంగుడు కావడం, అతని తల్లి వృద్దురాలు కావడంతో అక్కడే ఉండిపోయారు. ఇది గమనించిన శ్రీరాములు భార్య స్వప్న.. అప్రమత్తమై వారిద్దరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే మంటల్లో చిక్కుకుపోయి శ్రీరాములు, అతని భార్య స్వప్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరిలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో ఈ దంపతులు ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş