iDreamPost
android-app
ios-app

లండన్‌లో హైదరాబాద్ వ్యక్తికి 16 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..?

ఎంఎస్ చేద్దామని లండన్ వెళ్లాడు హైదరాబాద్ యువకుడు. అక్కడకు వెళ్లాక.. చదువు మీద శ్రద్ధ కన్నా.. గూగుల్లో వాటి గురించి వెతకడం స్టార్ట్ చేశాడు. చివరకు 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎందుకంటే..?

ఎంఎస్ చేద్దామని లండన్ వెళ్లాడు హైదరాబాద్ యువకుడు. అక్కడకు వెళ్లాక.. చదువు మీద శ్రద్ధ కన్నా.. గూగుల్లో వాటి గురించి వెతకడం స్టార్ట్ చేశాడు. చివరకు 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎందుకంటే..?

లండన్‌లో హైదరాబాద్ వ్యక్తికి 16 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..?

ప్రియురాలితో లవ్ బ్రేకప్ అయితే.. కొంత మంది ప్రేమికులు మూవ్ ఆన్ అయిపోతారు. మరికొంత మంది తాగుబోతులుగా మారిపోతుంటారు. నిత్యం తాగి.. ప్రేయసిని గుర్తు చేసుకుంటూ బాధపడిపోతుంటారు. ఇంకొంత మంది ఉన్నారు.. క్రూయల్ మెంటాలిటీతో ఉంటారు. తనకు దక్కని మరెవ్వరికీ దక్కకూడదని ఆలోచిస్తూ ఉంటారు. తన ప్రేమను కాదందన్న అక్కసుతో ఎంతకు అయినా తెగిస్తారు. చివరకు ప్రేయసిని అంతం చేసేందుకు కూడా వెనుకాడరు. తన ప్రేమను కాదందన్న ఓ కేరళ అమ్మాయిని గూగుల్లో ఎలా చంపాలో చూసి మరీ హత్య చేశాడు ప్రియుడు. హైదరాబాద్‌లో మొదలైన ప్రేమ కథ.. లండన్‌లో ముగిసింది.

మార్చి 5, 2022న యుకెలోని లండన్‌లోని రెస్టారెంట్‌లో తన మాజీ ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపిన కేసులో హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ అంబర్లకు 16 సంవత్సరాల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన సోనా బిజు.. హైదరాబాద్ నివాసి అయిన శ్రీరామ్‌కు 2017లో భాగ్య నగరంలోనే పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత వీరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇదే క్రమంలో 2022లో యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో ఎంఎస్ చేసేందుకు యుకె వెళ్లారు వీరిద్దరూ. యుకేలోని హైదరాబాద్ వాలా రెస్టారెంట్‌లో సోనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేరింది.

అక్కడకు వచ్చేవాడు శ్రీరామ్. అతడ్ని మాజీ ప్రియుడిలా కాకుండా.. కస్టమర్‌గానే ట్రీట్ చేసేది సోనా. అయితే శ్రీరామ్ మాత్రం ఆమె అలా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం పెట్టేవాడు. లేకుంటే చంపేస్తానని బెదిరించేవాడు. అయినా నీతో జీవితాంతం కలిసి ఉండలేనని తెగేసి చెప్పింది సోనా. దీంతో అక్కసు పెంచుకున్న శ్రీరామ్.. ఆమెను చంపేయాలని అనుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడవడంతో చనిపోయింది. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. గూగుల్‌లో మానవుడ్నిచంపడం ఎలా, యుకేలో ఓ విదేశీయుడు హత్య చేస్తే ఏం జరుగుతుంది..? కత్తితో ఒకరిని ఎంత సులభంగా చంపొచ్చు? అని వెతికినట్లు గుర్తించారు పోలీసులు. కోర్టులో హాజరు పరచగా..16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.