Uppula Naresh
Uppula Naresh
ప్రైవేట్ పార్ట్స్ లో బంగారం.. అక్కడ బంగారం ఏంటనే షాకవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఓ ప్రయాణికుడు ఆ బంగారాన్ని ఎక్కడ దాచోలో తెలియక ఏకంగా తన ప్రైవేట్ పార్ట్స్ లో భద్రపరుచుకున్నాడు. ఇక మొత్తానికి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చెకింగ్ లో అడ్డంగా దొరికి నోట్లో నీళ్లు నమిలిలాడు. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక అసలు విషయం ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తాజాగా ఓ ప్రయాణికుడు ఇండిగో విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. ఈ క్రమంలోనే కస్టమ్స్ అధికారులు అనుమానం ఉన్న ప్రయాణికులను ఒక్కొక్కరిని చెక్ చేయడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో ఓ ప్రయాణికుడిపై అనుమానంతో అధికారులు అతడిని మొత్తం పరీక్షించగా ప్రైవేట్ పార్ట్స్ లో ఏకంగా 785 గ్రాముల, 24 క్యారెట్ల బంగారం బయటపడింది. ఇది చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే అతని వద్ద ఉన్న ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే? ఈ బంగారం విలువ దాదాపు రూ.47.49 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దారుణం: కన్న కూతురిని హత్య చేసిన తండ్రి! ఎందుకో తెలుసా?