iDreamPost
android-app
ios-app

దారుణం: కన్న కూతురిని హత్య చేసిన తండ్రి! ఎందుకో తెలుసా?

  • Published Aug 28, 2023 | 8:40 AM Updated Updated Aug 28, 2023 | 8:40 AM
  • Published Aug 28, 2023 | 8:40 AMUpdated Aug 28, 2023 | 8:40 AM
దారుణం: కన్న కూతురిని హత్య చేసిన తండ్రి! ఎందుకో తెలుసా?

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉంటున్నామా అన్న అనుమానం కలుగుతోంది. క్షణికావేశంలో అడ్డొచ్చిన ఎవరినీ వదలకుండా హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కన్న కూతురినే తండ్రి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా తండ్రి బంధువుల్లో ఓ వ్యక్తితో కలిసి అంతిమ సంస్కారాలు చేశాడు. చివరికి అసలు విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో తండ్రి దారుణం బయటపడింది. ఇంతకు తండ్రి కూతురిని ఎందుకు హత్య చేశాడో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని కోలారు పరిధిలోని తొట్లి గ్రామంలో రమ్య (19) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఇదే గ్రామానికి చెందిన మరో కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అలా వీరి ప్రేమయాణం కొన్నాళ్ల పాటు కొనసాగింది. ఇదే విషయం ఇటీవల రమ్య తండ్రి వెంకటేష్ గౌడకు తెలియడంతో కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. కానీ, కూతురు ప్రేమించిన వాడిని వదులు కోవడం ఇష్టం లేక అతనితో మళ్లీ మాట్లాడింది. దీంతో తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. పరువు తీస్తున్న కూతురిని హత్య చేయాలని అనుకున్నాడు తండ్రి. ఇక ఇందులో భాగంగానే ఈ నెల 25న రాత్రి వెంకటేష్ గౌడ కూతురిని హత్య హత్య చేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. బంధువులకు ఏదో చెప్పి నమ్మించి మొత్తానికి అదే రాత్రి కూతురికి దహన సంస్కారాలు కూడా జరిపాడు.

కాగా, రమ్య చనిపోవడం, అంతిమ సంస్కారాలు జరపడం.. ఇవన్నీ తెలుసుకున్న గ్రామస్తులకు ఎక్కడో అనుమానం కలిగింది. దీంతో కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతురాలి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తండ్రిని పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా.. నా కూతురు మరో కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని, అది నచ్చకే హత్య చేశానని అంగీకరించాడు. ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్య తండ్రి వెంటకటేష్ గౌడతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పరువు హత్యకు పాల్పడిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా నడి రోడ్డుపై..!

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet