Uppula Naresh
Uppula Naresh
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటి ఓనర్ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న యువతిపై కన్నేశాడు. ఎలాగైన ఆమెకు తెలియకుండా ఆ పని చేయాలని భావించాడు. ఇక పక్కా ప్లాన్ తోనే అతడు ఓ రోజు ఆ యువతిని నమ్మించి ఆమె గదిలోకి వెళ్లాడు. అస్సలు అనుమానం రాకుండా చేయాల్సింది అంతా చేసేశాడు. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో అద్దెకు ఉంటున్న యువతి ఒక్కసారిగా షాక్ గురైంది. చేసేదేం లేక ఆ అమ్మాయి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని హైలమ్ కాలనీలో సమీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇదే ప్రాంతంలో ఓ సొంత ఇల్లు ఉంది. అయితే, సమీర్ ఇంట్లోకి రెండేళ్ల కిందట ఓ యువతి అద్దెకు దిగింది. అప్పటి నుంచి ఆ యువతి తన తమ్ముడితో పాటు కలిసి ఉంటుంది. చూడటానికి కాస్త అందంగా ఉండడంతో సమీర్ ఆ యువతిపై కన్నేశాడు. ఎలాగైన ఆ యువతి గదిలో సీసీ కెమెరా పెట్టాలని అనుకున్నాడు. ఇక పక్కా ప్లాన్ తోనే సమీర్ ఇటీవల.. కరెంట్ మీటర్ బాక్స్ పెట్టాలని ఆ యువతి గదిలోకి వెళ్లాడు. ఆ యువతి కూడా నిజమే అనుకుంది.
సమీర్ ఆ గదిలో బాక్సుతో పాటు అందులో రహస్యంగా ఓ సీసీ కెమెరాను కూడా అమర్చాడు. దీంతో అప్పటి నుంచి ఆ యువతి బట్టలు మార్చుకుంటుండగా అంతా రికార్డ్ చేసి చూసి ఆనందిస్తున్నాడు. ఇక ఆ యువతికి అనుమానం రావడంతో గదిలో ఉన్న కరెంట్ మీటర ను పరిశీలించగా.. అందులో సీసీ కెమెరా అని తెలింది. నెత్తి, నోరు బాదుకున్న ఆ యువతి వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.