జీవితంలో ఉన్నత ఉద్యోగం సాధించి, తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలన్నది ఆ యువతి కల. అందుకోసం హైదరాబాద్ చేరుకుంది. అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2కు ప్రిపేర్ అవుతోంది ప్రవళిక. కానీ ఆమె కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. ఏం జరిగిందో ఏమో గానీ.. రూమ్ లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ప్రవళిక. బయటకి వెళ్లిన ఫ్రెండ్స్ వచ్చి రూమ్ లో చూడగా.. విగత జీవిగా కనిపించింది. దీంతో హాస్టల్ నిర్వాహకుడికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆమె చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లెటర్ ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తోంది.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రవళిక. గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ఆమె.. రూమ్ లో ఎవరూ లేని టైమ్ చూసి ఆత్మహత్యకు పాల్పడింది. బయటకి వెళ్లిన స్నేహితులు వచ్చి చూడగా.. ప్రవళిక ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వెంటనే హాస్టల్ నిర్వాహకుడికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించడానికి ప్రయత్నించగా.. విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు అశోక్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కాగా.. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయడంతోనే వరంగల్ కు చెందిన ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. “అమ్మా నన్ను క్షమించండి. నా వల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. నేను చాలా నష్టజాతకురాలిని. జగ్రత్తగా ఉండండి, ఏడవకండి అమ్మా. నన్ను చిన్నప్పటి నుంచి కాళ్లు కిందపెట్టకుండా పెంచారు. నేను మీకు అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా” అంటూ సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించింది. ఈ లెటర్ చదివిన వారందరికి కన్నీళ్లు తెప్పిస్తోంది. అయితే ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి వర్షన్ మరోలా ఉంది.. ప్రవల్లిక ప్రేమ వ్యహారం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని, గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం వల్ల కాదని.. ప్రవల్లిక మృతిపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.