iDreamPost
android-app
ios-app

అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని వేధింపులు.. ఆ మహిళ ఏం చేసిందంటే..

  • Published Oct 13, 2023 | 9:33 PM Updated Updated Oct 13, 2023 | 9:33 PM
  • Published Oct 13, 2023 | 9:33 PMUpdated Oct 13, 2023 | 9:33 PM
అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని వేధింపులు.. ఆ మహిళ ఏం చేసిందంటే..

అక్రమ సంబంధాల కారణంగా నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా, మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తనతో పాటు రావాలంటూ ప్రియుడు టార్చర్‌ చేయటంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని హాసన్‌, రాజ్‌కుమార్‌ నగర్‌కు చెందిన 30  ఏళ్ల షభానా సుల్తాన్‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమెకు ఇస్మాయిల్‌ అనే వ్యక్తితో పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఇంటినుంచి దూరంగా పారిపోయారు. అయితే, బంధువులు రాజీ చేయటంతో షభానా భర్తతో ఉండటానికి ఒప్పుకుంది. మనసు మార్చుకుని భర్తతో ఉంటోంది. కానీ, షభానా భర్తతో ఉండటం ఇస్మాయిల్‌కు నచ్చలేదు. ఆమెను తనతో పాటు రమ్మని వేధించటం మొదలుపెట్టాడు. ఇ‍ద్దరూ ఏకాంతంగా ఉన్నపుడు తీసిన ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగాడు. వాటిని ఆమె భర్త, పిల్లలకు పంపుతానని భయపెట్టసాగాడు.

ఎంత చెప్పినా ఇస్మాయిల్‌లో మార్పురాలేదు. ఆమెను వేధించటం మానలేదు. తనతో పాటు రావాలని నిత్యం ఇబ్బంది పెట్టేవాడు. షభానా అతడి వేధింపులు తట్టుకోలేకపోయింది. చావటం ఒక్కటే తన సమస్యకు పరిష్కారం అనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇస్మాయిల్‌ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş