Dharani
Dharani
గురువు అంటే అజ్ఞానంధకారాన్ని తొలగించి.. విజ్ఞాన జ్యోతులు వెలిగింపజేస్తాడని నమ్ముతారు. విద్యార్థులకు మంచి, చెడు బోధించడమే కాక.. ఓటమిలో కుంగిపోకుండా.. విజయం వస్తే పొంగిపోకుండా ఎలా స్థితప్రజ్ఞతతో వ్యహరించాలో వారికి గురువే నేర్పిస్తారు. పైగా మన సమాజంలో ఉపాధ్యాయుడికి దైవానికి మించి స్థానం ఇచ్చారు. అయితే నేటి కాలంలో కొందరు గురువుల తీరుతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని కూడా అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి సమాజంలో. విద్యార్థులకు మంచి, చెడు నేర్పించాల్సిన టీచర్లే.. తప్పుడు మార్గంలో పయనిస్తే.. ఇక వారిని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు. తాజాగా ఓ పంతులమ్మ చేసిన పని చూసి జనాలు ఇలానే చర్చించుకుంటున్నారు. ఇంతకు ఆ టీచర్ ఏం చేసిందంటే..
కారణం ఏంటో తెలియదు కానీ.. ఓ టీచరమ్మ.. కన్న బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా దారుణానికి ఒడిగట్టింది. ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందని నక్కల అశోక్, అతడి భార్య విజయ(36) గతం కొలంగా సిటీలో నివస్తున్నారు. నగరంలోని ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. ఇక విజయ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. దాంతో పాటు చిట్టీలు నిర్వహిస్తుండేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా జూలై 29న అశోక్ నల్లగొండలోని సొంత ఇంటికి వెళ్లాడు.
ఇక మరుసటి రోజు అనగా ఆదివారం సాయంత్రం విజయ పిల్లలను సమీపంలోని షాప్ వద్దకు పంపింది. వారు బయటకు వెళ్లాక విజయ బెడ్రూంలోకి వెళ్లి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. షాప్ దగ్గరకు వెళ్లిన పిలలు ఇంటికి వచ్చి ఎంత సేపు తలుపుకొట్టినా లోపలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో పిల్లలు ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పి.. సాయం చేయమని కోరారు. వారు విజయ ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. విషయం తెలిసిన వెంటనే ఇంటికి చేరుకున్నఅశోక్.. విజయ మృతదేహాన్ని నల్లగొండ తరలించాడు. అయితే పోస్ట్‌మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు ఎలా చేస్తారంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తిరిగి విజయ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.