iDreamPost
android-app
ios-app

ప్రేమికుడి మరణవార్త విని.. ఇంత గొప్పగా ప్రేమించావా తల్లి?

ప్రేమికుడి మరణవార్త విని.. ఇంత గొప్పగా ప్రేమించావా తల్లి?

ఈ అమ్మాయి పేరు నేహా. పంజాబ్ కు చెందిన ఈ యువతి చాలా కాలంగా హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇక నగరంలోని నానక్ రామ్ గూడలో ఉన్న ఓ బేకరీలో పనికి కుదిరింది. ఇక్కడే పని చేస్తున్న సల్మాన్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే సల్మాన్ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని నేహా సైతం తాజాగా బలవన్మరణానికి పాల్పడింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ కు చెందిన నేహా (19) గత ఆరు నెలలుగా నగరంలోని గోపన్ పల్లి గచ్చిబౌలీ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలోని ఓ ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. అయితే, నేహా గత ఆరు నెలల నుంచి నానక్ రామ్ గూడలోని ఓ బేకరీలో పనికి కుదిరింది. ఇక్కడే బాలాపూర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు సైతం పని చేసేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా వీరి స్నేహం చివరికి ప్రేమగా మారి ప్రేమించుకుంటున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే సల్మాన్ ఇటీవల ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ, అతని తల్లిదండ్రులు నిరాకరించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సల్మాన్.. ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల తర్వాత ఇదే విషయం అతని ప్రియురాలు నేహాకు తెలియడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడు లేని జీవితం ఎందుకు అనుకుందో ఏమో కానీ.. తాజాగా తన హాస్టల్ గదిలో నేహా బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బంది ఈ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet