iDreamPost
android-app
ios-app

సొంత తమ్ముడిని చంపిన అన్న! ఎందుకు తెలిస్తే షాక్ అవుతారు!

  • Published Oct 06, 2023 | 4:39 PM Updated Updated Oct 06, 2023 | 4:39 PM
  • Published Oct 06, 2023 | 4:39 PMUpdated Oct 06, 2023 | 4:39 PM
సొంత తమ్ముడిని చంపిన అన్న! ఎందుకు తెలిస్తే షాక్ అవుతారు!

హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఫిల్మ్ నగర్ ఏరియాలో నివాసం ఉండే షబ్బీర్ అహ్మద్ అనే వ్యక్తి.. తన సొంత తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత డయల్ 100కు ఫోన్ చేసి జరిగిందంతా వివరించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు షబ్బీర్ అహ్మద్ అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు షబ్బీర్ తన తమ్ముడిని ఎందుకు చంపాడో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని బసవతారక నగర్ లో సజ్జి అహ్మద్ (39), షబ్బీర్ అహ్మద్ అనే ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ ఉండేవారు. ఇదిలా ఉంటే.. సజ్జి అహ్మద్ అన్న అయిన షబ్బీర్ కు గతంలో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అయితే అన్నదమ్ములు ఇద్దరు మద్యానికి బానిసయ్యారు. అలా మద్యం సేవించి ఇంటికి వచ్చి షబ్బీర్ అహ్మద్ తమ్ముడు సజ్జి అహ్మద్ తరుచు ఇంట్లో గొడవలు చేసేవాడట.

ఇంతే కాకుండా షబ్బీర్ అహ్మద్ భార్యను సైతం లైంగికంగా వేధించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి షబ్బీర్ అహ్మద్ భార్య గత 5 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లి అప్పటి నుంచి తిరిగి రాలేదు. తమ్ముడి వల్లే నా భార్య నా నుంచి దూరమైందని షబ్బీర్ అహ్మద్ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే తన తమ్ముడైన సజ్జి అహ్మద్ పై కోపంతో అతడిని హత్య చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే షబ్బీర్ అహ్మద్ బుధవారం తమ్ముడితో కలిసి మద్యం సేవించాడు.

ఆ తర్వాత పక్కా ప్లాన్ తో కత్తితో తమ్ముడు సజ్జి అహ్మద్ ను దారుణంగా హత్య చేశాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి.. నా తమ్ముడిని నేనే హత్య చేశానని తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు షబ్బీర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom