iDreamPost

కనిపించకుండా పోయిన కూతురు.. కానీ, జరిగిందేంటంటే?

కనిపించకుండా పోయిన కూతురు.. కానీ, జరిగిందేంటంటే?

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారుల మిస్సింగ్ ఘటనలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. అయితే ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చేసుకుంది. నేపాల్ కు చెందిన సజినా సప్ కోట అనే బాలిక ఈ నెల 4న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. ఆ రోజు రాత్రైన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతా గాలించారు. కానీ, కూతురు జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేంలేక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. నేపాల్ కు చెందిన బిక్రం అనే వ్యక్తి తన భార్యా కూతుళ్లతో కలిసి బతుకు దెరువు కోసం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడకు వచ్చాడు. ఇక్కడే పాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇతని పెద్ద కుమార్తె సజినా సప్ కోట అనే బాలిక ఈ నెల 4 న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. ఆ రోజు రాత్రైన ఆ అమ్మాయి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు.

కానీ, కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక వారికి ఏం చేయాలో తెలియక వెంటనే పహాడీ షరీఫ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి కూతురు కనిపించకుండా పోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాగైన మా కూతురిని తీసుకురండి అంటూ పోలీసులను వేడుకున్నారు. ఎవరికైనా ఆ బాలిక ఆచూకి తెలిస్తే..8712662367 అనే నెంబర్ ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి