Dharani
తక్కువ ధరకే బంగారం.. మీర కట్టిన డబ్బులకు రెట్టింపు బంగారం అనగానే.. చాలా మంది ముందు వెనకా ఆలోచించకుండా.. స్కీమ్స్‌లో చేరుతున్నారు. ఆ తర్వాత భారీగా మోససోతున్నారు. తాజాగా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
తక్కువ ధరకే బంగారం.. మీర కట్టిన డబ్బులకు రెట్టింపు బంగారం అనగానే.. చాలా మంది ముందు వెనకా ఆలోచించకుండా.. స్కీమ్స్‌లో చేరుతున్నారు. ఆ తర్వాత భారీగా మోససోతున్నారు. తాజాగా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
Dharani
బంగారం.. భారతీయులను ఊరించే మాట ఇది. పసిడి అత్యంత ఖరీదైన, అమూల్యమైన లోహం అని అందరికి తెలుసు. బంగారాన్ని తయారు చేయలేము.. సహజసిద్ధంగా ఏర్పడి.. భూమి లోపల పొరలను తవ్వి వెలికి తీసి.. శుద్ధి చేసి.. మన వరకు తీసుకురావాలి. మన దేశంలో బంగారు గనులు చాలా అంటే చాలా తక్కువ. దాంతో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే మన దగ్గర పసిడి ధర.. చుక్కలను తాకుతుంది. అయితే రేటు ఎంత పెరిగినా సరే.. బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. బాగా ధనవంతులైతే ఒకేసారి పెద్ద మొత్తంలో పుత్తడి కొంటారు. ఇక సామాన్యులు, మధ్య తరగతి వారు మాత్రం.. బంగారం మీద ఆశతో రకరకాల స్కీమ్స్‌లో చేరుతుంటారు. ఇక ఈమధ్య కాలంలో అన్ని ప్రముఖ జ్యువెలరీ షాపులు.. గోల్డ్ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తూ.. 11, 12వ నెలలో అన్నాళ్లు మనం కట్టిన మొత్తానికి సరిపడా బంగారం తీసుకోవచ్చు. ఇలాంటి పథకాల్లో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. మేకింగ్, తరుగు, ఇతరాత్ర అదనపు భారం మనపై పడదు. అందుకే చాలా మంది ఇలాంటి స్కీమ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అందరూ మంచివారే ఉంటారు.. మోసం చేయరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. తాజాగా ఓ చోట.. తక్కువ ధరకే గోల్డ్ అంటూ ప్రచారం చేసి.. ఓ స్కీమ్ ప్రారంభించారు. జనాలు వీరి మాటలు నమ్మి భారీ సంఖ్యలో చేరారు. ఇంకేముంది.. సుమారు 4 కోట్ల రూపాయలతో చెక్కేశారు నిందితులు. ఆ వివరాలు..
తాజాగా హైదరాబాద్‌లో ఈ స్కామ్ వెలుగు చూసింది. తక్కువ ధరకే బంగారం అనగానే ముందు వెనకా చూడకుండా దానిలో చేరారు. ఈ బలహీనతను క్యాష్ చేసుకున్న ఓ ముఠా.. తక్కువ మొత్తానికే గోల్డ్ ఇస్తామని ఊరించి.. పలురురి నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. ఆపై పరారయ్యారు. మోసపోయాం అని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన విశాల్, వినయ్, అఖిల్ ముగ్గురు స్నేహితులు కలిసి.. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ.. ఓ గోల్డ్ స్కీమ్ ఏర్పాటు చేశారు. ముందుగా 50 వేల రూపాయలతో చేరితే.. మార్కెట్ కన్నా 10 శాతం తక్కువకే బంగారం వస్తుందంటూ.. జనాలను నమ్మించి డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత దీన్ని చైన్ సిస్టమ్‌లా మార్చారు. జనాలను నమ్మించడం కోసం ముందుగా ఈ స్కీమ్‌లో చేరి.. పెట్టిబడి పెట్టిన వాళ్లకు తక్కువ ధరకే బంగారం ఇచ్చి.. లాభాలు కలుగుతాయని నమ్మించారు.
జనాలు కూడా వీరిని బాగా నమ్మి.. పెద్ద ఎత్తున ఈ స్కీమ్‌లో చేరారు. అలా 4 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసిన నిందితులు.. ఆ తర్వాత ముఖం చాటేశారు. ఆ మొత్తం తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో రామంతాపూర్‌కు చెందిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ కొత్త మొసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. తక్కువ ధరకే బంగారం అనేది పచ్చి మోసమని.. ఇలాంటి వాటిని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.