Dharani
మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సీఐ మృతి చెందగా.. ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వివరాలు..
మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సీఐ మృతి చెందగా.. ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వివరాలు..
Dharani
డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు.. అలానే డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు.. అతి వేగంతో వాహనాలు నడపరాదు.. అంటూ నిత్యం అధికారులు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. రోడ్డు ప్రమాదాల గురించి ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ కొందరు ఈ మాటలను అస్సలు వినరు. రాష్ డ్రైవింగ్‌తో తమను, తమ కుటుంబాన్ని మాత్రమే కాక.. ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిస సంఘటన ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు బలయ్యారు. ఈ ప్రమాదంలో ఒక సీఐ మృతి చెందగా.. మరోక ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వివరాలు..
హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును యూటర్న్ చేస్తూ రాంగ్ రూట్‌లో వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీ కొట్టింది. దాంతో బైక్‌పై వస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. ప్రమాదంలో గాయలైన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఖాజావలి మొహినుద్దీన్ అని తెలిపారు పోలీసులు.
సీఐ సాధిక్ అలీ, ఎస్సై మొహినుద్దీన్‌గ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కి వెళ్లి.. పూర్తయ్యాక మలక్‌పేట్‌లోని తమ క్వార్టర్స్‌కు వెళుతుండడగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పారిపోయాడని తెలిపారు. దాంతో పోలీసులు కారును సీజ్ చేశారు. దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలానే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డ్రైవర్‌ని గుర్తించే పనిలో ఉన్నారు. సీఐ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.