iDreamPost
android-app
ios-app

HYDలో యువకుడి దారుణం.. యువతిని హత్య చేసి ఆ తర్వాత..!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఓ యువకుడు యువతిని దారుణంగా హత్య చేశాడు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఓ యువకుడు యువతిని దారుణంగా హత్య చేశాడు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

HYDలో యువకుడి దారుణం.. యువతిని హత్య చేసి ఆ తర్వాత..!

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో పాటు చాలా కాలం పాటు కలిసి ఉంటున్న ఓ యువతిపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు. ఇంతటితో సరి పెట్టని ఈ దుర్మార్గుడు.. మరో ఊహించని పని చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హనుమంతు అనే యువకుడు స్వప్న (24) అనే యువతితో రెండు నెలల కిందట ఐఎస్ సదన్ చంపాపేట్ పరిధిలోని రాజీరెడ్డి నగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మా చెల్లెలు అంటూ ఇంటి ఓనర్ ను నమ్మించాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నట్లు సమాచారం. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., హనుమంతు తాజాగా స్వప్నను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత హనుమంతు వీరుంటున్న బిల్డింగ్ రెండవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వెంటనే అప్రమత్తమైన స్థానికులు హనుమంతును ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం పోలీసులు దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom