iDreamPost
android-app
ios-app

ట్యాక్సీ డ్రైవర్ లవ్ కోసం.. UK నుండి వచ్చేసిన మహిళ..

అతడో ట్యాక్సీ డ్రైవర్. అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. లగ్జరీ లైఫ్, బంగారం లాంగటి భర్తను వదిలేసి ఇండియాకు వచ్చేసింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అతడో ట్యాక్సీ డ్రైవర్. అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. లగ్జరీ లైఫ్, బంగారం లాంగటి భర్తను వదిలేసి ఇండియాకు వచ్చేసింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ట్యాక్సీ డ్రైవర్ లవ్ కోసం.. UK నుండి వచ్చేసిన మహిళ..

అందమైన కుటుంబం ఆమెది. లక్షలు సంపాదించే భర్త. బంగారం లాంటి పిల్లలు. కానీ ఓ పరిచయం ఆమె లైఫ్ టర్నింగ్ చేసేసింది. భర్త దగ్గర దొరకని ప్రేమ.. ఓ ట్యాక్సీ డ్రైవర్ వద్ద ఉందని భ్రమ పడి ఖండాంతరాలు దాటి వచ్చేసింది. టాక్సీ డ్రైవర్ కోసం భర్తను, బిడ్డల్ని వదిలేసి.. తన ప్రేమ ముఖ్యమని భారత్ లో అడుగుపెట్టింది వివాహిత. లగ్జరీ లైఫ్ వద్దనుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలించగా.. ప్రియుడితో గోవాలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కించారు. ఇంతకు లండన్‌లో ఉన్న ఆమెకు క్యాబ్ డ్రైవర్‪తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల క్రితం లండన్ షిఫ్ట్ అయ్యింది ఫ్యామిలీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ తల్లి చనిపోవడంతో హైదరాబాద్ వచ్చింది. ఆస్తికలు కలిపేందుకు, ఇతర పనులు చక్కబెట్టుకునేందుకు స్థానికంగా ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుంది. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్ శివ.. మహిళ ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇక్కడ పనులు పూర్తయ్యాక తిరిగి లండన్ వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి ఆమెతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. టాక్సీ డ్రైవర్ మాటలకు వివాహిత ఆకర్షితురాలైంది. తన భర్త దగ్గర దొరకని ప్రేమ అతడి దగ్గర దొరికిందని ఫీల్ అయ్యింది. పూర్తిగా అతడి ప్రేమ వలలో పడింది. ఇదే క్రమంలో సెప్టెంబర్ 16న వివాహిత భర్త తల్లి, అంటే ఆమె అత్త చనిపోయింది. దీంతో ఒంటరిగా హైదరాబాద్ వచ్చాడు ఆమె భర్త.

అయితే ఈ నెల 30న ప్రియుడి పుట్టిన రోజు వేడుకలు ఉండటంతో.. పిల్లల్ని వదిలేసి.. హైదరాబాద్ వచ్చేసింది. తల్లి కనిపించకపోవడంతో పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్న తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన లండన్ వెళ్లి ఆరా తీయడంతో భార్య హైదరాబాద్ వచ్చిందని నిర్ధారించుకున్నాడు. ఆమె ఫోన్ పలుమార్లు ప్రయత్నించగా.. ఎట్టకేలకు కాల్ కనెక్ట్ అయ్యింది.  ఈ నెల 5న లండన్ రావడానికి టికెట్ తీసుకున్నానని, వచ్చేస్తున్నానంటూ ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో కాకమ్మ కబుర్లు చెబుతూ వచ్చింది. దీంతో భర్తకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేయగా.. గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి ఆమెను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి లండన్ పంపేశారు. వివాహితను ట్రాప్‌ చేసి అపహరించిన ట్యాక్సీ డ్రైవర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.