iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు.. తల్లిదండ్రులు ప్రేమగా ఇంటికి పిలిచి..!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి గతేడాది ఈ యువడిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లై ఏడాది కావడంతో ఇటీవల ఆమె తల్లిదండ్రులు నమ్మించి ఇంటికి తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత జరిగిన దారుణం ఏంటంటే?

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి గతేడాది ఈ యువడిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లై ఏడాది కావడంతో ఇటీవల ఆమె తల్లిదండ్రులు నమ్మించి ఇంటికి తీసుకెళ్లారు. కానీ, ఆ తర్వాత జరిగిన దారుణం ఏంటంటే?

ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు.. తల్లిదండ్రులు ప్రేమగా ఇంటికి పిలిచి..!

పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు గతేడాది ఓ గుడిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి రాజ్‌గఢ్ రోడ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అలా పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా గడిపారు. ఇక వీరి వివాహం జరిగి ఏడాది కావొచ్చింది. వీళ్లు పెళ్లి రోజు కూడా జరుపుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరారు. ప్రేమగా అడగడంతో యువతి వెంటనే తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కట్ చేస్తే.. ఊహించని దారుణం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా హిస్సార్ జిల్లాలోని ఓ ప్రాంతంలో శీతల్, మన్ దీప్ అనే యువతి, యువకుడు నివాసం ఉండేవారు. గతంలో వీరి పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయం శీతల్ తన కుటుంబ సభ్యులకు వివరించింది. కానీ, కూతురు ప్రేమ పెళ్లిని వాళ్లు అంగీకరించలేదు. దీంతో ఈ జంటకు ఏం చేయాలో తెలియక.. గతేడాది పెద్దలను ఎదురించి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దంపతులు రాజ్‌గఢ్ రోడ్‌లోని వీధి నంబర్ 4లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. భర్త ఏదో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా వీరి పెళ్ళై ఏడాది కావడంతో పెళ్లి రోజు కూడా జరుపుకోవాలని భావించారు.

ఈ క్రమంలలోనే శీతల్ కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటించారు. పెళ్లి రోజున ఇంటికి రావాలని శీతల్ ను కోరడంతో ఆమె సరే అంటూ మురిసిపోయింది. వారు కోరినట్లే ఇటీవల ఆ యువతి పుట్టింటికి వెళ్లింది. ఇక మరుసటి రోజు మన్ దీప్ తన భార్యకు ఫోన్ చేస్తే ఎంతకు స్పందించలేదు. ఇక అనుమానంతో అంతటా వెతకాడు. ఇదే సమయంలో శీతల్ ను చంపి అప్పటికే దహనం చేసినట్లు తెలుసుకుని భర్త గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఇదే ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా భార్య వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని, ఇది నచ్చకే వారి కుటుంబ సభ్యులు ఇటీవల ఆమెను నమ్మించి ఇంటికి పిలిచారు. ఆ తర్వాత శీతలక ను హత్య చేసి దహనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişcasibompokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet