iDreamPost
android-app
ios-app

హోటల్ గదిలో శవమైన మాజీ మోడల్.. అసలేం జరిగిందంటే

  • Published Jan 04, 2024 | 9:36 AM Updated Updated Jan 04, 2024 | 12:04 PM

అందమైన యువతి.. తన భవిష్యత్తు గురించి కోటి కలలు కన్నది. వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండగానే దారుణం చోటు చేసుకుంది. ఇంతకు అసలేం జరిగిందంటే..

అందమైన యువతి.. తన భవిష్యత్తు గురించి కోటి కలలు కన్నది. వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండగానే దారుణం చోటు చేసుకుంది. ఇంతకు అసలేం జరిగిందంటే..

  • Published Jan 04, 2024 | 9:36 AMUpdated Jan 04, 2024 | 12:04 PM
హోటల్ గదిలో శవమైన మాజీ మోడల్.. అసలేం జరిగిందంటే

పైన ఫొటోలో కనిపిస్తోన్న యువతిని చూశారు కదా.. అందానికే అసూయ కలిగించేంత అందంగా ఉంది. తన భవిష్యత్తు కోసం కోటి కలలు కన్నది. వాటిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భావించింది. కాకపోతే తప్పటడుగులు వేసింది. అదే ఆమె పాలిట శాపమయ్యింది. ఇంతందం భూమి మీద ఉండటం కొందరికి నచ్చలేదు. అందుకే అత్యంత దారుణంగా ఆమెని హతమర్చారు. మూడో కంటికి తెలియకుండా శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు నిందితులు.

హర్యానాలోని గురుగ్రామ్ లో ఈ దారుణం వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్‌లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్‌ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితులు ఆమెని దారుణంగా హత్య చేయడమే కాక.. డెడ్ బాడీని మాయం చేసే ప్రయత్నం చేశారు. కానీ అడ్డంగా బుక్కయ్యారు. అసలేందుకు ఈ దారుణానికి పాల్పడాల్సి వచ్చింది అంటే.. పాత గొడవలు కారణంగా అంటున్నారు పోలీసులు.

model divya pahuja murder

హత్యకు గురైన దివ్య పహుజా మాజీ మోడల్ మాత్రమే కాక.. ఓ గ్యాంగ్ స్టర్ గర్ల్ ఫ్రెండ్. అతడే సందీప్ గడోలీ. అయితే గురుగ్రామ్‌ పోలీసులు 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను  బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దివ్యా పహుజా ప్రధాన నిందితురాలు కావడం గమనార్హం.

అయితే సందీప్ గర్ల్‌ఫ్రెండ్‌ అయిన దివ్య పహుజా.. అతడి వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్‌ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది.

ఈ క్రమంలో తాజాగా దివ్య సిటీ పాయింట్ హోటల్లో బస చేసింది. దివ్యను హత్య చేసిన నిందుతు అభిజిత్ ఈ హోటల్ ఓనర్ కావడం గమనార్హం. దివ్య హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడు అభిజిత్‌, యువతి, మరో వ్యక్తి జనవరి 2న హోటల్‌ రిసెప్షన్‌ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి 111వ నంబర్ రూమ్‌ కి వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్‌ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి.. ఆమె బస చేసిన రూమ్‌ నుంచి బయటకు లాక్కెళ్లడం, ఆ  తర్వాత నిందితులు హోటల్‌ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం సీసీటీవీలో రికార్డయ్యింది.

పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్‌, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అభిజిత్ అతడి హోటల్‌లో పనిచేసే  ప్రకాశ్‌, ఇంద్రజ్‌లు అనే మరో ఇద్దరిని కూడా గురుగ్రామ్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. దివ్య హత్యకు స్కెచ్‌ వేసిన అభిజిత్‌ ఆమె మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా పడేసేందుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దివ్య.. తిరిగి రాకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  అయితే గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్‌, అభిజీత్‌తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.