Venkateswarlu
Venkateswarlu
ఈ మధ్య కాలంలో పిల్లల్లో కూడా పైశాచిక ఆనందం బాగా పెరిగిపోయింది. కొందరు చిన్నారులు తమ సంతోషం కోసం ఇతరుల్ని ఇబ్బందికి గురిచేస్తున్నారు. చదువుకునే చోట కూడా తోటి విద్యార్థులతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజా ఘటనలో.. క్లాస్ రూములో బాలికల వేధింపులు భరించలేక ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మరణించాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానా రాష్ట్రంలోని హిసర్‌కు చెందిన ఓ బాలుడు అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. తన క్లాస్‌లోని ఓ ఇద్దరు బాలికలు అతడ్ని తరచుగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నావంటూ.. సూటి పోటి మాటల్తో అతడ్ని వేధిస్తూ వస్తున్నారు. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. సెప్టెంబర్ 30 తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బాలికలతో పాటు ఓ టీచర్ కూడా తమ కుమారుడ్ని ఇబ్బంది పెట్టేదని తల్లి ఆరోపిస్తోంది. చాలా సార్లు కుమారుడు వారిపై తన దగ్గర ఫిర్యాదు చేశాడని చెప్పింది. కాగా, పోలీసులు అన్ని కోణాల్లోంచి విచారణ చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.