Gujarat-Heart Attack At Garbha Events: గర్భా వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో ఏకంగా 10 మంది మృతి

గర్భా వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో ఏకంగా 10 మంది మృతి

దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన గర్భా వేడుకల్లో పాల్గొన్న వారిలో 10 మంది గుండెపోటుతో మృతి చెందారు. ఆ వివరాలు..

దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన గర్భా వేడుకల్లో పాల్గొన్న వారిలో 10 మంది గుండెపోటుతో మృతి చెందారు. ఆ వివరాలు..

గత కొద్ది నెలలుగా దేశవ్యాస్తంగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వారు.. ఒక్కసారిగా విరుచుకుపడిపోతున్నారు. చూస్తుండగానే కళ్ల ముందే ప్రాణాలు విడుస్తున్నారు. మరీ ముఖ్యంగా శుభకార్యాల్లో పాల్గొని.. బంధువులు, స్నేహితులతో కలిసి.. సరదగా డ్యాన్స్‌ చేస్తూ.. గుండెపోటుతో మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఇలా గుండెపోటుతో మృతి చెందుతున్న వారిలో పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మాట్లాడుతూ.. ఆటలాడుతూ.. పనిచేస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వారంతా.. ఇలా ఒక్కసారిగా కూర్చొన్న చోటనే కుప్పకూలిపోతున్నారు. ఈ అకస్మాత్తు గుండెపోటు మరణాలపై నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో ఏకంగా 10 మంది గుండెపోటుతో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివరాలు..

గుజరాత్‌లో దసరా వేడుకలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది గర్భా నృత్యం. మన దగ్గర కూడా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక చోట్ల ఈ గర్భా నృత్య వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక గుజరాత్‌లో అయితే ఇవి కంపల్సరీ. అయితే ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన గర్భా వేడుక ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. దసరా నవరాత్రుల సందర్భంగా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ ఏకంగా 10 మంది గుండెపోటుతో మరణించడం సంచలనంగా మారింది.

ఇలా మృతి చెందిన వారిలో 13 ఏళ్ల బాలుడు కూడా వుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్భా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మరణించాడు. అదే విధంగా కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు కూడా గర్భా ఆడుతూ ప్రాణాలు విడిచాడు.

అంతేకాక రాష్ట్రంలో నవరాత్రులు ప్రారంభమైన తొలి ఆరు రోజులలోనే 108 అంబులెన్స్ సేవలకు గుండె సంబంధిత సమస్యలపై 521 కాల్స్, శ్వాస ఆడటం లేదంటూ 690 కాల్స్ వచ్చాయని అధికారుల తెలిపారు. ఇవన్నీ కూడా సాధారణంగా గర్భా వేడుకలు జరిగే సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య రికార్డ్ చేయబడ్డాయని వెల్లడించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

దీనిలో భాగంగా గర్భా వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్స్ సెంటర్స్ అప్రమత్తంగా వుండాలని గుజరాత్ ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈవెంట్‌లలోకి అంబులెన్స్‌లు వేగంగా ప్రవేశించేందుకు కారిడార్‌లను రూపొందించాలని గర్భా నిర్వాహకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమ సిబ్బందికి సీపీఆర్ చేయడంపై శిక్షణ ఇవ్వాలని, కార్యక్రమంలో పాల్గొనేవారికి పుష్కళంగా మంచినీటిని అందుబాటులో వుంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Show comments