iDreamPost
android-app
ios-app

Visakhapatnam: ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

  • Published Dec 14, 2023 | 1:14 PM Updated Updated Dec 14, 2023 | 1:14 PM

విశాఖపట్నంలోని, ఇండస్ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

విశాఖపట్నంలోని, ఇండస్ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Dec 14, 2023 | 1:14 PMUpdated Dec 14, 2023 | 1:14 PM
Visakhapatnam: ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్‌ థియేటర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియడంతో.. రోగులు భయంతో పరుగులు తీశారు. కానీ కొందరు మాత్రం.. మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. ఆస్పత్రి వద్దకు చేరుకుని.. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్ని ప్రమాదం కారణంగా.. ఆస్పత్రి పరిసరాల్లో.. దట్టమైన పొగ కమ్మకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు నాలుగు ఫైరింజన్లను వినియోగిండమే కాక.. పొగను బయటకు పంపేందుకు ఆస్పత్రి కిటికీ అద్దాలను పగలగొట్టారు సెక్యూరిటీ సిబ్బంది.

ప్రసుత్తం ఇండస్ ఆస్పత్రిలో మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొందరు పేషంట్లు పొగలో చిక్కుకుని.. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి.. మంటల్లో చిక్కుకున్న అందరినీ బయటకు తీసుకొచ్చారు. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆపరేషన్ థియేటర్లో మొత్తం 20 మంది పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నట్లు స్థానిక ఎమ్మార్వో తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెవిన్యూ, పోలీసు అధికారులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

బుధవారం రాత్రి కామరెడ్డిలో కూగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలోని అయ్యప్ప  షాపింగ్ మాల్ లోని మొదటి అంతస్తులో అగ్ని ప్రమాద చోటు చేసుకోవడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాత్రి నుంచి మంటలను ఆర్పే ప్రయత్నం మొదలు పెడితే.. ఉదయం 7 గంటలకు కానీ మంటలు అదుపులోకి రాలేదని తెలిపారు.