SNP
Miyapur, Hyderabad, Crime News: వారం రోజుల క్రితం మియాపూర్‌లో కలకలం సృష్టించిన బాలిక మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులో తండ్రే నిందితుడిగా తేలాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Miyapur, Hyderabad, Crime News: వారం రోజుల క్రితం మియాపూర్‌లో కలకలం సృష్టించిన బాలిక మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులో తండ్రే నిందితుడిగా తేలాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
వారం రోజుల క్రితం సంచలనంగా మారిన వియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఆ బాలికే తండ్రే నిందితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక అనుమానస్పద మృతి కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా పనిచేసి.. సీసీటీవీ ఫుటేజ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాలిక వసంత(12) హత్య కేసులో ఆమె తండ్రి బానోత్ నరేష్ నిందితుడని పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వారం రోజుల క్రితం తమ కూతురి కనిపించడం లేదని నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు విషయంలో బాలిక తండ్రిపై అనుమానంతో విచారణను ఆ కోణంలో చేపట్టారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తండ్రి నరేష్ పోర్న్ వీడియోలు చూడటం, మద్యానికి బానిసై.. తన కోరిక తీర్చాలని బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానంటూ బాలిక గట్టిగా అరవడంతో కోపంతో బాలికను హత మార్చాడు నరేష్. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి.. బాలిక జట్టు పట్టుకుని గట్టిగా నేలకేసి కొట్టాడు. దాంతో బాలిక ప్రాణాలు వదిలింది. కూతుర్ని చంపేసి.. నిర్మానుష్య ప్రాంతం నుంచి నరేష్ బయటికి రావడం, మళ్లీ వెళ్లడం ఇలా అంతా సీసీ టీవీలో రికార్డ్ అయింది.
బాలికను తీసుకెళ్లిన 11 నిమిషాల్లోనే నరేష్ ఆ పొదల్లొంచి బయటికి వచ్చాడు. ఈ తక్కువ టైమ్‌లోనే బాలిక ప్రాణాలు తీశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి మళ్లీ చూసి వచ్చాడు. ఇలా వరుసగా మూడు రోజులు అక్కడికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూసి వచ్చాడు. హత్య చేసిన రోజునే.. తన కూతురి కనిపించడం లేదంటూ పోలీసులకు తన భార్యతో కలిసి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు నరేష్. కూతుర్ని చంపి వారం రోజులగా తప్పు ఒప్పుకోకుండా నటిస్తున్నాడు నరేష్. అతని తీరుపై అనుమానంతో పోలీసులు విచారణ జరిపి కేసును ఓ కొలిక్కి తెచ్చారు. తండ్రి నరేష్ బాలికను హత్య చేశాడంటూ అతన్ని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. నరేష్ స్వగ్రామం హమబూబబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట్ గ్రామంలోని లక్ష్మణ్ తండా. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. అయితే.. వాళ్లు హైదరాబాద్ వచ్చి కేవలం 15 రోజులు మాత్రమే అవుతుంది. ఇంతలోనే ఇంత దారుణం చేశాడు నరేష్. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.