iDreamPost
android-app
ios-app

ఘోర రోడ్డు ప్రమాదం.. మధ్యప్రదేశ్ లో ట్రక్కు బోల్తా.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రక్కు బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు.

ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. పోలీసులు రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు. డ్రైవర్ల అజాగ్రత్తల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు బోల్తా పడి 14 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 21 మంది తీవ్రగాయాలపాలయ్యారు. బడ్జర్ గ్రామ సమీపంలో ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ వికాస్‌ మిశ్రా మాట్లాడుతూ.. క్షతగాత్రులను షాహ్‌పుర ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విశాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంపై సీఎం మోహన్‌ యాదవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు.