East Godavari Crime news: భార్యపై భర్తకు అనుమానం.. అత్త అలా చేసిందని అల్లుడు చంపేశాడు!

భార్యపై భర్తకు అనుమానం.. అత్త అలా చేసిందని అల్లుడు చంపేశాడు!

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ అల్లుడు ఏకంగా సొంత అత్తనే కొట్టి చంపాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆ తర్వాత స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి పరిధిలోని ఉప్పరగూడెం గ్రామం. ఇక్కడే దండు శ్రీను-సింహాచలం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. అయితే, ఈ క్రమంలోనే భర్త శ్రీను భార్య పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధం కొనసాగుతుందనే అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతో తరుచు ఆమెను వేధిస్తుండేవాడు.

ఇదే విషయమై దంపతులిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. ఇక భర్త టార్చర్ ను భరించలేని ఆ ఇల్లాలు జరుగుతున్నదంతా తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వాళ్లు స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు భార్యాభర్తలను పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అయినా శ్రీను ప్రవర్తనలో మార్పు మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే ఇటీవల భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. కోపంతో ఊగిపోయిన శ్రీను భార్యపై దాడి చేయబోయాడు. ఇక అక్కడే ఉన్న సింహాచలం తల్లి అల్లుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో0 పట్టరాని కోపంతో అల్లుడు అడ్డొచ్చిన అత్తను దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. క్షణికావేశంలో అడ్డొచ్చిన అత్తను చంపిన అల్లుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: దిండు కింద కొడవలి.. భార్య పుట్టింటికి వెళ్లగానే..

Show comments