iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి భార్య ఉండగా.. అతడికి అదేం బుద్దో..!

ఎంతో అపురూపంగా పెంచుకున్న అమ్మాయిని.. ఓ అయ్య చేతిలోె పెట్టారు తల్లిదండ్రులు. అబ్బాయి, అతడి కుటుంబ సభ్యులు అడిగిన లక్షల కట్నం ఇచ్చారు. కానుకలు అందించారు. కానీ..

ఎంతో అపురూపంగా పెంచుకున్న అమ్మాయిని.. ఓ అయ్య చేతిలోె పెట్టారు తల్లిదండ్రులు. అబ్బాయి, అతడి కుటుంబ సభ్యులు అడిగిన లక్షల కట్నం ఇచ్చారు. కానుకలు అందించారు. కానీ..

బంగారం లాంటి భార్య ఉండగా.. అతడికి అదేం బుద్దో..!

ప్రస్తుతం ఆడపిల్ల, మగ పిల్లవాడన్న వ్యత్యాసం చూపించడం లేదు తల్లిదండ్రులు. ఇద్దర్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఆస్థిపాస్తులు కూడా సమానంగా పంచుతున్నారు. అలాగే కూతురు పెళ్లి విషయంలో కాస్త ఎక్కువ ఆలోచన చేస్తున్నారు.వెళ్లిన చోట కుమార్తె సుఖపడాలన్న ఉద్దేశంతో భారీ కట్న కానుకలతో, తమ తాహతుకు మించి వివాహం చేసి అత్తారింటికి సాగనంపుతున్నారు. అల్లుడు అడిగిందల్లా ఇస్తున్నారు. అయిన వారి దాహం తీరడం లేదు. ఇంకా తీసుకురావాలంటూ వేధించుకు తింటున్నారు. తమ పేరెంట్స్ పరిస్థితి తెలిసిన అమ్మాయి అందుకు ససేమీరా అనడంతో.. భర్త చేతిలో శారీరక, మానసిక హింసకు గురౌతున్నారు.

అపురూపంగా పెంచుకున్న బంగారు బొమ్మను చేతిలో పెడితే.. తిరిగి అచేతన స్థితిలో తండ్రి అప్పగించాడో కిరాతక భర్త. పెళ్లైన ఏడాదికే భార్యను మరింత కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో.. ఆ బాధను తట్టుకోలేక యువతి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బేతి విజయ-వెంకటేశ్వర్లు కుమార్తె అర్చనకు.. అదే జిల్లా కొత్తవాడకు చెందిన కందగట్ల విజయలక్ష్మి-వెంకటయ్య దంపతుల కుమారుడు సందీప్‌తో డిసెంబర్ 18, 2022లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ. 8 లక్షలు ఇచ్చారు. బంగారం, ఇతర కానుకలు అందించారు.

సందీప్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండటంతో.. అక్కడ కాపురం పెట్టాడు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం సవ్యంగా సాగిపోయినా.. ఆ తర్వాత అతడిలో డబ్బు దాహం పెరిగిపోయింది. పుట్టింటి నుండి మరింత కట్నం తీసుకురావాలంటూ..అర్చనను వేధించడం ప్రారంభించాడు సందీప్. ఆమె కాదనడంతో ఆ హింస మరింత ఎక్కువైంది. ఆమెకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది అర్చన. కాగా, ఈ నెల 24న సమ్మక్క-సారలమ్మ జాతర కోసం అర్చన, సందీప్ దంపతులు స్వగ్రామానికి వచ్చారు. 25న రాత్రి సందదీప్ భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆమెను మీ ఇంటికి తీసుకెళ్లాలంటూ చెప్పాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులు అర్చనను తమ ఇంటికి తీసుకెళ్లారు.

సరైన ఆహారం ఇవ్వకపోవడంతో.. అప్పటికే కాస్త అనారోగ్యానికి గురైన అర్చన పరిస్థితి స్వగ్రామానికి వెళ్లాక మరింత దిగజారిపోయింది. అపస్మారక స్థితిలో వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు.. వర్థన్న పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అర్చన తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదుతో సందీప్ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారణ జరుగుతోంది.