Krishna Kowshik
దూరంగా ఉంటున్న మరిది పనుల కోసమని విశాఖ పట్నం వచ్చాడు. ఎక్కడో ఎందుకు అని తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది వదిన. రోజు అక్కడ నుండి పనులకు వెళ్లసాగాడు. కానీ అంతలో అతడి బుద్ది వక్రమార్గం పట్టింది.
దూరంగా ఉంటున్న మరిది పనుల కోసమని విశాఖ పట్నం వచ్చాడు. ఎక్కడో ఎందుకు అని తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది వదిన. రోజు అక్కడ నుండి పనులకు వెళ్లసాగాడు. కానీ అంతలో అతడి బుద్ది వక్రమార్గం పట్టింది.
Krishna Kowshik
శత్రువులు ఎక్కడో ఉండరు.. కుటుంబ సభ్యుల రూపంలో చుట్టూ తిరుగుతుంటారు. కాస్తంత వారి కన్నా బాగున్నా తట్టుకోలేరు. అస్తమాను కడుపు మంటతో రగిలిపోతుంటారు. ఆర్థికంగా, కాస్తంత బంగారం కొనుక్కున్నా సహించలేకపోతుంటారు. చివరకు ఆస్తి పాస్తుల విషయంలో తగాదా పెట్టుకుని, చంపుకునేంత వరకు వెళుతుంటారు. తాజాగా ఇదే జరిగింది విశాఖ పట్నంలోని గోపాల పురంలో. పనికోసమని మరిది విజయవాడ నుండి విశాఖకు వచ్చాడు. అన్న లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న వదిన చెంతకు చేరాడు. చాలా దూరం నుండి మరిది రావడంతో ఆశ్రయం ఇచ్చింది వదిన. మరిది కదా అని చేరదీసింది. ఒంటరిగా ఉంటున్న ఆమెపై, ఆమె ధరించిన నగలపై కన్నేశాడు మరిది. చివరకు ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. నగలతో ఉడాయించాడు.
బంగారు నగల కోసం ఆశ్రయం ఇచ్చిన వదిననే హతమార్చాడు మరిది. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో అంబేద్కర్ కాలనీ వాంబే గృహ సముదాయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. బంగారమ్మకు భర్త చనిపోగా.. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసింది. ఒక్కర్తే నివసిస్తోంది. తల్లి తరుఫు కుటంబ సభ్యుల సాయంతో ఇంటి వద్ద సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఆమెకు మరిది దుర్గారావు ఉన్నాడు. అతడు విజయవాడలో పెయింట్ వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం పెయింటింగ్ పనుల కోసమని విజయవాడ నుండి విశాఖకు వచ్చాడు. వదిన బంగారమ్మ వద్ద ఉంటూనే పనులకు వెళ్లి వస్తున్నాడు. అయితే ఈ క్రమంలో తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. ఆమె బంగారంపై కన్నేశాడు.
ఆదివారం రాత్రి వదిన, మరిది మధ్య డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఉదయం చూసే సరికి బంగారమ్మ మృతి చెంది కనిపించింది. ఆమె ఒంటిపై నగలు కనిపించలేదు. దుర్గారావు కూడా కనిపించకపోవడంతో అతడే ఈ హత్య చేసి ఆమె ఒంటిపై నగలు తీసుకుని పరారైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నాడు. అనంతరం ఆమె మెడకు ఉరి వేసినట్లు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. నిందితుడు దుర్గారావు గురించి గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.