iDreamPost
android-app
ios-app

బ్యాంకు ఉద్యోగిని దారుణ నిర్ణయం.. 6 నెలలుగా వాళ్లు వేధిస్తున్నారని..!

ఇంట, బయట ఎక్కడా ఆడ పిల్లలకు రక్షణ లేదు. ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్లామనుకునే లోపు.. వర్కింగ్ ప్లేసులో చికాకు తెప్పిస్తుంటారు కొంత మంది. కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక తనకు నచ్చకపోతే ఆమెను మరోలా హింసిస్తుంటారు.

ఇంట, బయట ఎక్కడా ఆడ పిల్లలకు రక్షణ లేదు. ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్లామనుకునే లోపు.. వర్కింగ్ ప్లేసులో చికాకు తెప్పిస్తుంటారు కొంత మంది. కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక తనకు నచ్చకపోతే ఆమెను మరోలా హింసిస్తుంటారు.

బ్యాంకు ఉద్యోగిని దారుణ నిర్ణయం.. 6 నెలలుగా వాళ్లు వేధిస్తున్నారని..!

ఆకాశంలో సగం, అవనిలో సగం, మహిళా సాధికారికత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఇంట, బయట ఆడ పిల్ల వివక్షతను ఎదుర్కొంటుంది. ఒకప్పుడు అమ్మాయి పుట్టిందనగానే అత్తారింట్లో చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడిప్పుడే అవగాహన, సామాజిక పరిస్థితులు మారడంతో ఆడపిల్లల పట్ల చూసే తీరు మారుతుంది. దీంతో చదువులో, ఆట పాటల్లో రాణిస్తున్నారు. రెక్కలిచ్చి ఎగరమనడం లేదు కానీ కాస్తంత స్వేచ్ఛ, స్వాత్రంత్యాలను అందిస్తున్నారు. అలాగే అన్నింటా నెగ్గుకు రావాలన్న ధైర్యాన్ని నింపుతున్నారు. ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళుతున్నాం అనుకునేలోపు ..పని ప్రదేశాల్లో నరకం చూస్తున్నారు ఆడపిల్లలు. వర్కింగ్ ప్లేసులో వేధింపులను తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పని ప్రదేశంలో బాడీ షేమింగ్, వేధింపుల వల్ల మానసిక హింసకు గురైన శివానీ త్యాగి అనే బ్యాంకు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. శివానీ త్యాగీ నోయిడాలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్ షిప్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. ఆరు నెలలుగా ఆమె తీవ్రమైన వేధింపులు ఎదుర్కొంటోంది. బాడీ షేమింగ్ చేయడంతో పాటు అవమానాలకు గురైంది. తొలుత ఆమె పడుతున్న ఇబ్బందుల గురించి తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ రాను రానూ ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకుని ఏడ్చింది. దీంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో ఐదుగురి పేర్లను పేర్కొంటూ.. తనను వేధించారని, వీరికి మరణ శిక్ష విధించాలని కోరింది.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమె సోదరుడు గౌరవ్ త్యాగి మాట్లాడుతూ.. ఆమె సహోద్యోగులే తన సోదరిని టార్చర్ చేశారని చెప్పుకొచ్చాడు. తన డ్రెస్సింగ్ సెన్స్, ఆహారపు అలవాట్లు, మాట్లాడే పద్ధతిని టార్గెట్ చేసేవాళ్లు, అలాగే ఓ సమయంలో తన సోదరిపై మహిళ దాడి కూడా చేసింది. చాలా సార్లు రాజీనామా కూడా చేయడానికి ప్రయత్నించింది. కానీ ఏదో ఒక సాకు చెప్పి కంపెనీ తిరస్కరిస్తూ వచ్చింది. శివానీ చేయని తప్పుకు టెర్మినేషన్ లేఖ కూడా అందుకుంది. ఇన్నీ అవమానాలు, టార్చర్ తట్టుకోలేక తన సోదరి ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. తనను వేధిస్తున్న వారిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.