iDreamPost

శోభనం కోసం ఏర్పాట్లు.. గదిలో అలా కనిపించిన వరుడు.. వధువు షాక్

కొత్త జంటను చూసి ఇరు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. జూలై 2న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. జులై 3న అత్తారింటికి కోడలిని సాగనంపారు ఆమె పుట్టింటి వారు. ఆ రోజు రాత్రికే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలని చర్చ జరుగుతోంది. అంతలో వరుడు..

కొత్త జంటను చూసి ఇరు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. జూలై 2న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. జులై 3న అత్తారింటికి కోడలిని సాగనంపారు ఆమె పుట్టింటి వారు. ఆ రోజు రాత్రికే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలని చర్చ జరుగుతోంది. అంతలో వరుడు..

శోభనం కోసం ఏర్పాట్లు..  గదిలో అలా కనిపించిన వరుడు.. వధువు షాక్

పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు పెద్దలు. పెళ్లి అనగానే హడావుడి, హంగు, ఆర్భాటాలు కామన్. ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు పెళ్లి చేసుకుంటారు.  ఎక్కడి లేని సందడంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. బంధువుల రాకపోకలు, చిలిపి సంఘటనలు, చిన్న చిన్న గొడవలు, అలకలు మరింత ఆనందాన్ని రంగరిస్తుంటాయి. ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే సెంట్రాఫ్ ఎట్రాక్షన్. పెళ్లి ముచ్చట్లు మొదలు పెట్టిన నాటి నుండే ఇద్దరిలో ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఇక సర్వస్వం భర్తే అని భావించే పెళ్లి కూతురు.. జీవితంపై కొంగొత్త ఆశయాలతో అడుగుపెడుతుంది. ఇక తొలి రాత్రి భయం కూడా ఆమెను వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇంకొన్ని గంటల్లోనే తొలి రాత్రికి సిద్ధమౌతున్న వేళ.. ఆమె విధవగా మారిపోయింది.

ఓ జంటకు పెళ్లైంది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు, కూతుర్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు ఆమె మెట్టినింటి వాళ్లు. మరికొన్ని గంటల్లో కొత్తగా పెళ్లైన దంపతులకు ఫస్ట్ నైట్ అనుకుంటున్నారు. అంతలో పెళ్లి కొడుకు తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.  అతడి గదికి వెళ్లింది కొత్త పెళ్లి కూతురు. ఎంతకు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు కొట్టి చూగా.. ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. పెళ్లైన కొన్ని గంటల్లోనే .. మాంగళ్యాన్ని పొగొట్టుకుంది నవ వధవు. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..ఉస్రహర్ ప్రాంతంలోని శివార గ్రామానికి చెందిన జ్ఞాన్ సింగ్ యాదవ్ ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అతని చిన్న కుమారుడు సతేంద్ర యాదవ్‌కు తఖా రతన్‌పురా గ్రామానికి చెందిన వినీతా యాదవ్‌తో జూలై 2న వివాహం జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు పట్టలేని ఆనందంతో ఉన్నారు. జులై 3న, వధువును మెట్టినింటికి తెచ్చారు. ఊరేగింపుగా మధ్యాహ్నం 2 గంటలకు శివరాకు చేరుకుంది నవ వధువు. కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. రాత్రి పూట జాగరణ చేయడంతో బంధువులు, కొంత మంది కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అయితే ఇంట్లోని మహిళలు పెళ్లికూతురుతో పాటు ఇతర పూజలు చేయడం ప్రారంభించారు. సాయంత్రం ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడంపై చర్చించుకుంటున్నారు. అంతలో సతేంద్ర యాదవ్ .. తల్లికి బంగారపు ఉంగరం.. ఇతర వస్తువులు ఇచ్చి నిద్ర పోతానంటూ తన గదిలోకి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తలపులు కొట్టగా తీయకపోవడంతో అనుమానంతో పగులగొట్టగా.. ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వధువు షాక్‌కు గురై అక్కడే స్పృహతప్పి పడిపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి