iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్‌‌ని నమ్మి ఆ తప్పు చేసింది! అతను మాత్రం!

కృతికకు చిన్నప్పటి నుండి చదువు తప్ప మరో లోకం తెలియదు. ఎంబీబీఎస్ చదవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే మెడిసన్ ఎంట్రన్స్ పాసయ్యి కాలేజీలో చేరింది. ఆరు నెలలు గడిచాయో లేదో..

కృతికకు చిన్నప్పటి నుండి చదువు తప్ప మరో లోకం తెలియదు. ఎంబీబీఎస్ చదవాలని అనుకుంది. అనుకున్నట్లుగానే మెడిసన్ ఎంట్రన్స్ పాసయ్యి కాలేజీలో చేరింది. ఆరు నెలలు గడిచాయో లేదో..

బాయ్ ఫ్రెండ్‌‌ని నమ్మి  ఆ  తప్పు చేసింది! అతను  మాత్రం!

ఆమె చదువుల తల్లి సరస్వతి. చిన్నప్పటి నుండే చదువులో చాలా చురుకు. డాక్టర్ కావాలన్నదే ఆమె లక్ష్యం. దాని కోసం రాత్రి అనక, పగలనక కష్టపడి చదివేది, మంచి మార్కులు తెచ్చుకునేది. ఆమె పడిన కష్టానికి ప్రతి ఫలం కూడా దక్కింది. 2019లో పదో తరగతి పరీక్షల్లో ఆమెకు మంచి మార్కులు వచ్చాయి. 98 శాతం మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్లస్ 2లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అనంతరం ఆమె మెడిసన్ ఎంట్రన్స్ రాయగా.. తాను అనుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యింది. అక్కడే చదువుతూ హాస్టల్లో ఉంటుంది. కానీ ఓ రోజు స్నేహితుడితో కలిసి ఓ రాత్రి వాకింగ్ అని వెళ్లింది. కానీ ఎంతకు తిరిగి రాలేదు.

ఫోన్లు చేశారు తోటి విద్యార్థులు. హాస్టల్ సిబ్బంది కూడా వెతకడం స్టార్ చేశారు. చివరకు హాస్టల్‌కు కిలో మీటర్ దూరంలో ఉన్న రైల్వే ట్రాకుపై ఆమె మృతదేహం కనిపించింది. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన అమ్మాయి శవమై తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే యుపి చెందిన కృతిక..చిన్నప్పటి నుండే చదువులో రాణించేది. డాక్టర్ కావాలని కలలు కనింది. దాన్ని సాకారం చేసుకునేందుకు కష్టపడింది కూడా. అనుకున్నట్లే… ముజఫర్ నగర్ మెడికల్ కాలేజీలో సీటు లభించింది. అక్కడకు వెళ్లి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తాజాగా తన క్లాస్ మేట్ కునాల్ సైనీతో కలిసి వాకింగ్‌కు వెళ్లింది.

అయితే ఎంత సేపటికి తిరిగి రాలేదు. వెంటనే తోటి స్నేహితులు ఫోన్స్ చేయగా.. స్పందించలేదు. హాస్టల్ సిబ్బంది వెతుకగా.. అక్కడే కిలో మీటర్ దూరంలో ఉన్న రైల్వే ట్రాకుపై శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. డాక్టర్ అవుతుందని భావించిన తల్లిదండ్రులకు కూతురి మరణ వార్త తెలిసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, కునాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కాగా, తన కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్య అని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. అతడే చంపి.. ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.