iDreamPost
android-app
ios-app

అత్తా అని ఆప్యాయంగా పిలుస్తూ.. మనసులో మాత్రం కామంతో!

  • Published Mar 16, 2024 | 1:01 PM Updated Updated Mar 16, 2024 | 1:01 PM

ఆమెను అత్తా అంటూ సంబోధించేవాడు 22 ఏళ్ల కుర్రాడు. ఒకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఒక్క రోజు కూడా ఆమెను చూడకుండా.. మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అయితే..

ఆమెను అత్తా అంటూ సంబోధించేవాడు 22 ఏళ్ల కుర్రాడు. ఒకే గ్రామం కావడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఒక్క రోజు కూడా ఆమెను చూడకుండా.. మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అయితే..

  • Published Mar 16, 2024 | 1:01 PMUpdated Mar 16, 2024 | 1:01 PM
అత్తా అని ఆప్యాయంగా పిలుస్తూ.. మనసులో మాత్రం కామంతో!

పెళ్లైన మగవాళ్లు.. మహిళలతో వివాహేతర సంబంధాన్ని కోరుకుంటున్నారని ఇటీవల ఓ యాప్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ విషయంలో తామేమీ తీసుపోమని నిరూపిస్తున్నారు యువకులు. ప్రేమ, వ్యామోహనికి తేడా తెలియడం లేదు ఈ రోజుల్లో కొంత మంది కుర్రాళ్లకు. పెళ్లై, పిల్లలున్న మహిళలతో అక్రమ సంబంధాలను నెరుపుతున్నారు. తల్లిదండ్రులు మందలించినా, ప్రియురాలి భర్తకు, కుటుంబ సభ్యులకు తెలిసి, వార్నింగ్ ఇచ్చినా కూడా నిసిగ్గుగా వ్యవహరిస్తూ, ఆమె కౌగిలి కోసం పరితపించిపోతున్నారు. ఆమె కాదంటే కక్ష పెంచుకుంటున్నారు. అడ్డుగా ఉన్న భర్తను పిల్లల్ని, లేకుంటే ఆమెపై కూడా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు కొందరు. తాజాగా ఆంటీపై మనస్సు పడ్డ కుర్రాడు.. ఆమె కాదనడంతో దారుణానికి ఒడిగట్టాడు.

ఓ మహిళను అత్తా అంటూ పిలిచి..పరిచయం పెంచుకుని, వివాహేతర సంబంధం నెరిపాడో కుర్రాడు. చివరకు ఆమె కాదనడంతో కాపు కాచి హత్య చేశాడు. ఈ ఉదంతం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగింది. మార్చి 10వ తేదీన లింగసుగూరు పట్టణంలోని ఎంజీఎల్ లాడ్జీ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించగా.. ఆధార్ కార్డు లభించింది. దీంతో ఆమె పేరు విజయలక్ష్మిగా తేలింది. మాస్కీ తాలూకా అంకుశదొడ్డి గ్రామంగా గుర్తించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో.. లింగసుగూరు తాలూకా యారడోన గ్రామం అని తెలిసింది. మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అప్పుడు వెలుగులోకి వచ్చింది అతడి పేరు. 22 ఏళ్ల యువకుడు దేవప్పపై అనుమానం వ్యక్తం చేయడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు తెలిశాయి. అంకుశదొడ్డి గ్రామానికి చెందిన సోమనాథ్ అన్నోరాతో విజయలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. హాయిగా సాగిపోతున్న సంసారంలో కుదుపు. రెండేళ్ల క్రితం భర్త సోమనాథ్ చనిపోవడంతో.. అత్తారింటి నుండి కొడుకుతో పుట్టింటికి చేరింది. అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో దేవప్ప అనే యువకుడు పరిచయం అయ్యాడు ఆమెకు . అతడు విజయలక్ష్మిని అత్త అంటూ సంబోధించేవాడు. ఈ క్రమంలో విజయలక్ష్మి కూడా అతడితో చనువుగా మెలగడం స్టార్ట్ చేసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఒక్కోసారి ఆమె ఇంటికి వెళ్లి కలిసేవాడు కూడా. ఈ విషయం ఆమె సోదరుడికి తెలిసి.. దేవప్పకు పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాలేదు వీరిద్దరిలో. దీంతో తన సోదరిని కొట్టి.. వార్నింగ్ ఇచ్చాడు ఆమె సోదరుడు. దీంతో ప్రియుడ్ని దూరం పెట్టసాగింది విజయలక్ష్మి. ఇలా రెండు నెలల నుండి అతడి నుండి తప్పించుకు తిరుగుతోంది. ఆమె వ్యామోహంలో పడిన అతడు.. ఈ విషయం గమనించాడు. తనను దూరం పెట్టడంపై ఆమెపై గుర్రుగా ఉన్నాడు. మార్చి 10న ఆమె ముదగల్ సమీపంలోని ఓ గుడికి వెళ్లిందన్న సమాచారం తెలుసుకున్న దేవప్ప.. అక్కడకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ పొదల్లో ఏకాంతంగా గడిపారు. ఇంతలో తనను ఎందుకు దూరం పెడుతున్నావని ప్రశ్నించగా.. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే కోపంతో ఉన్న అతడు రాయి పెట్టి ఆమెను కొట్టి.. చీరతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయాడు. తన నేరాన్ని నిందితుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom