Krishna Kowshik
ఇద్దరు క్లాస్ మేట్. మంచి ఫ్రెండ్స్. శుక్రవారం ఎంబీఎ పరీక్షలు ముగియడంతో తన ఇంటికి ఆహ్వానించింది గర్ల్ ఫ్రెండ్. మొహమాటంతో అక్కడికి వెళ్లాడు అతడు. శనివారం హాయిగా గడిచిపోయింది. ఆదివారం కాళరాత్రి అయ్యింది.
ఇద్దరు క్లాస్ మేట్. మంచి ఫ్రెండ్స్. శుక్రవారం ఎంబీఎ పరీక్షలు ముగియడంతో తన ఇంటికి ఆహ్వానించింది గర్ల్ ఫ్రెండ్. మొహమాటంతో అక్కడికి వెళ్లాడు అతడు. శనివారం హాయిగా గడిచిపోయింది. ఆదివారం కాళరాత్రి అయ్యింది.
Krishna Kowshik
ప్రేమించలేదని, లేదా బ్రేకప్ చెప్పిందని ప్రేయసిపై కత్తి దూస్తున్నారు ప్రియుళ్లు. ఇటీవల కాలంలో ఈ తరహా హత్యలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. ప్రేమించట్లేదని ఓ యువతిపై కాలేజీ ప్రాంగణంలో కత్తితో పలుమార్లు పొడిచాడో ఖర్కోటకుడు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలు తనను కాదందన్న అక్కసుతో సైకోలా మారిన లవర్.. ఆమె ఇంటికే వెళ్లి హత్య చేశాడు. ప్రియురాలితో పాటు ఆమె తల్లిదండ్రులతో దాడి చేశాడు. ప్రేయసితో పాటు ఈ గొడవతో సంబంధం లేని వ్యక్తి కూడా బలయ్యాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నిందితుడు ఆ ఇంట్లో పనిచేసిన డ్రైవరే కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. లిప్సా అనే యువతి ఎంబీఎ చదువుతుంది. ఆమె ఇంట్లో డ్రైవర్ రాజునాగ్ పనికి కుదిరాడు. అలా లిప్సా, రాజు దగ్గరయ్యారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో అతడికి బ్రేకప్ చెప్పింది. అనంతరం అతడు ఉద్యోగం మానేశాడు. అయినప్పటికీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది లిప్సా. అయితే తన ప్రేమను రిజక్ట్ చేసిందన్న కోపంతో రాజు.. ఈ ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశారు. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వెళ్లగా.. ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ తల్లిదండ్రులు అరిచారు. అనంతరం లిప్సాతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో బాలికను కత్తితో పొడిచాడు. యువతి మెడ, చేయిపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో వారిని ఓ గదిలో బంధించాడు.
అంతలో మరో గదిలో ఉన్న లిప్సా క్లాస్ మేట్ ప్రతాప్ లార్కా వచ్చాడు. రాజు బారి నుండి తన స్నేహితురాల్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రతాప్‌ను కూడా రాజునాగ్ కత్తితో పొడిచాడు. కత్తిపోట్లకు గురైనప్పటికీ, ప్రతాప్.. లిప్సా తల్లిదండ్రులను బంధించిన గది తలుపులు తెరిచాడు. చాలా చాక చక్యంగా వ్యవహరించాడు. దీంతో ఇంటి నుంచి పారిపోయారు రాజు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. అయితే లిప్సా, ప్రతాప్ చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. హత్యకు గురైన లిప్సా, ప్రతాప్ రూర్కెలాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ విద్యార్థులు. శుక్రవారం కాలేజీ పరీక్ష ముగిసిన తర్వాత ప్రతాప్ లిప్సా ఇంటికి వెళ్లాడు. తన క్లాస్ మేట్ ఇంట్లో ఉండి సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వెళ్దామనుకునే లోగా ప్రతాప్ హత్యకు గురయ్యాడు.