Krishna Kowshik
’ప్రేమ లేదని, ప్రేమించరాదని, సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు‘ అని ప్రేమలో విఫలమైన కొంత మంది లవర్స్ పాడుకుంటుంటారు. కానీ మరికొంత మంది కక్ష, కార్పణ్యాలతో రగిలిపోతుంటారు.
’ప్రేమ లేదని, ప్రేమించరాదని, సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు‘ అని ప్రేమలో విఫలమైన కొంత మంది లవర్స్ పాడుకుంటుంటారు. కానీ మరికొంత మంది కక్ష, కార్పణ్యాలతో రగిలిపోతుంటారు.
Krishna Kowshik
అన్ని ప్రేమలు పెళ్లి పీటలు ఎక్కవు. కొన్ని మధ్యలోనే చెదిరిపోతుంటాయి. కానీ వాటి తాలూకా గాయాలు జ్ఞాపకాలుగా గుండెలపై గుచ్చుకుంటూనే ఉంటాయి. కొంత మంది ప్రేమికులు.. బ్రేకప్ చెప్పుకున్నాక, నెల లేదా సంవత్సరం రెండు సంవత్సరాల్లో మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది లవర్ తనను కాదన్నందుకు కక్ష పెంచుకుంటూ ఉంటారు. నేను సంతోషంగా లేనప్పుడు.. తను ఆనందంగా ఉందకూడదన్న అక్కసును పెంచుకుంటూ.. వారిని రోజూ టార్చర్ చేస్తుంటారు. మానసికంగా హింసకు గురి చేస్తుంటారు. అది అమ్మాయి అయినా, అబ్బాయి ఐనా. ఇంకా దూరం పెడితే ఎంతకైనా తెగిస్తుంటారు. ఇదిగో ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది.
నవీ ముంబయికి చెందిన వైష్ణవి బాబర్.. గత డిసెంబర్ 12న సియోన్ లోని కాలేజీకని ఇంట్లో నుండి బయలు దేరిన అమ్మాయి.. తిరిగి రాలేదు. దీంతో తల్లి ఆ రోజే కలంబోలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ చేసింది. అదే రోజు వైభవ్ బురుంగలే అనే వ్యక్తి మృతదేహం జుయి నగర్ స్టేషన్ వద్ద రైలు పట్టాలపై గుర్తించారు పోలీసులు.. రైలు వస్తుండగా గమనించి ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. అతడి మృతిపై కేసు నమోదు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అతడి మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా..వైష్ణవిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను గుర్తించారు పోలీసులు. దీంతో వీరిద్దరూ లవర్స్ అన్న క్లారిటీకి వచ్చారు.
ఆ సూసైట్ నోట్‌లో ‘ఎల్ 01-501‘ వంటి డీకోడ్ పదాలు ఉన్నాయి. తొలుత అది ఏంటో అర్థం కాలేదు పోలీసులకు. అదేంటో తెలుసుకోవడానికి వారికి 34 రోజులు పట్టింది. ఆ తర్వాత డీ కోడ్ చేయగా.. అటవీ శాఖకు సంబంధించిన చెట్టుపై ఉన్న నంబర్‌గా కనుగొన్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. వైష్ణవి కనిపించకుండా పోయిన రోజు ప్రేమికులిద్దరూ ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలో కనిపించినట్లు గుర్తించారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు, అగ్ని మాపక దళం, సిడ్కో బృందం వైష్ణవి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 10 రోజుల పాటు సాగిన సెర్చ్ ఆపరేషన్ కోసం డ్రోన్లను కూడా వినియోగించారు.
ఖర్ఘర్‌లోని ఓవే క్యాంప్ ప్రాంతంలోని డంపింగ్ గ్రౌండ్‌లో పొదల్లో వైష్ణవి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాలేజీకి వెళ్లినప్పుడు వేసుకున్న దుస్తులు, చేతి గడియారం, ఐడీ కార్డు ఆధారంగా ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఎట్టకేలకు ఈ కేసును 34 రోజుల తర్వాత చేధించారు. ‘ఎల్ 01-501‘ ఆధారం చేసుకుని.. ఈ కేసును సాల్వ్ చేయగలిగారు. వైష్ణవి, వైభవ్ లవర్స్ కాగా, అతడికి ఆమె బ్రేకప్ చెప్పింది. తనను కాదందన్న అక్కసుతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్న ప్రియుడు.. ఆమెను బయటకు పిలిచి.. ఖర్ఘర్ హిల్స్ వద్దకు తీసుకెళ్లి.. అక్కడ గొంతు నులిమి చంపి, అక్కడ పొదల్లో దాచాడు. ఆ మృతదేహాన్ని ఎక్కడ దాచాడో కోడ్ భాషలో సూసైడ్ నోట్ రాసి.. అతడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరీ ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.