iDreamPost

భర్తను వదిలేసి.. రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉద్యోగం.. టెర్రస్ పైకి వెళ్లి..

రెండేళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తుంది బుల్ బుల్. ఓ రోజు సెల్ ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకు వెళ్లింది. కాసేపటి తర్వాత బయట ఏదో శబ్దం వినిపించగా వెళ్లి చూస్తే.. బుల్ బుల్ పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను

రెండేళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తుంది బుల్ బుల్. ఓ రోజు సెల్ ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకు వెళ్లింది. కాసేపటి తర్వాత బయట ఏదో శబ్దం వినిపించగా వెళ్లి చూస్తే.. బుల్ బుల్ పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను

భర్తను వదిలేసి.. రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఉద్యోగం.. టెర్రస్ పైకి వెళ్లి..

కొంత మంది చిన్న విషయాలకే తనువు చాలిస్తున్నారు. మార్కులు రాలేదని, తల్లిదండ్రులు కొట్టారని, సెల్ ఫోన్ లాక్కున్నారని టీనేజ్ పిల్లలు బలవంతంగా మరణాలకు పాల్పడుతుంటే..చదువుకుని, జీవితంపై ఎన్నో ఆశలతో కెరీర్ స్టార్ చేసిన యూత్ కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. లవర్ ప్రేమకు ఒప్పుకోలేదని, తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదన్న అకారణాలతో చనిపోతున్నారు. మరికొంత మంది బెట్టింగ్ యాప్స్‌కు బానిసై, అప్పులు చేసి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ యువతి తాను పనిచేస్తున్న ఆఫీసు అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది.

తాను పనిచేస్తున్న కార్యాలయం పై నుండి ఆత్మహత్య చేసుకుంది 27 ఏళ్ల యువతి. బాధితురాలు కనడియా గ్రామానికి చెందిన బుల్ బుల్‌ చందేలాగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన గురువారం ఉదయం 11.15 గంటలకు జరిగింది. ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సీసీటీవీలో ఆమె ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భవనం మీద నుండి దూకే ముందు ఆమె ఎవరితోనే ఫోనులో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఫోనును గోడపై వదిలేసి.. అనంతరం ఆమె అక్కడి నుండి దూకేసింది. గ్రౌండ్ ఫ్లోరులో ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ను ఢీకొని తలకు బలమైన గాయమైంది.

కాగా, తండ్రి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గోయల్‌నగర్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో తన కూతురు రెండేళ్లుగా పనిచేస్తుందని ఆమె తండ్రి మోహన్‌ చందేల్‌ తెలిపారు. ఆమెకు గతంలో పెళ్లి అయ్యిందని, కానీ భర్తతో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్నట్లు చెప్పారు. ఆమెకు ఓ పాప ఉంది. బుల్ బుల్ తల్లిదండ్రుల వద్దే జీవిస్తుంది. ఆమెకు అక్క, సోదరుడు ఉన్నారు. ఫోన్‌లో ఎవరో వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె కాల్ డేటా పరిశీలిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎవరైనా ఆమెను బెదిరించా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి