Krishna Kowshik
సోషల్ మీడియా ద్వాారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కేవలం రెండు నెలల పరిచయం.. వెంటనే ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు.. ఆ తర్వాత..
సోషల్ మీడియా ద్వాారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కేవలం రెండు నెలల పరిచయం.. వెంటనే ప్రేమకు దారి తీసింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు.. ఆ తర్వాత..
Krishna Kowshik
సోషల్ మీడియాను వినియోగించని మనిషి బహుశా ఉండడేమో. పొద్దున్న లేచిన దగ్గర నుండి అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక చాటింగ్, డేటింగ్ యాప్స్ వచ్చాక.. ప్రేమ, దోమలు, ముద్దు ముచ్చట్లు అన్ని సగం సామాజిక మాధ్యమాల్లోనే సాగిపోతున్నాయి. కొత్త కొత్త పరిచయాలకు, స్నేహాలకు, ప్రేమలకు నాందిగా మారాయి. గుడ్ మార్నింగ్ మెసేజ్ నుండి గుడ్ నైట్ సందేశాల వరకు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి యాప్స్‌ను వినియోగిస్తున్నారు. ఇక ప్రేమ కవితలకు, కహానీలకు అడ్డే లేదు. కొంత మంది ఇదే సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. కానీ ఇదే ప్రేమ ఇప్పుడు విషాదంగా మారింది.
రెండు నెలల క్రితం ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం..ప్రేమగా మారింది. కానీ నెల రోజుల తర్వాత వీరి ప్రేమతో పాటు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటన కేరళలోని కొల్లంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో వీరిద్దరూ లవర్స్ అని గుర్తించారు. మృతులను కొల్లాం చందనాతోప్పు ప్రాంతానికి చెందిన శశితరణ్ కుమారుడు అనంతు, కొచ్చిలోని కలమసెరీ ప్రాంతానికి చెందిన మధు కుమార్తె మీనాక్షిగా గుర్తించారు పోలీసులు. స్థానికులను విచారించగా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెండు నెలల క్రితమే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని తేలింది.
అది ప్రేమకు దారి తీసిందని గుర్తించారు. అనంతు ఫాతిమా నేషనల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీఏ చదువుతుండగా.. మీనాక్షి 12వ తరగతి చదువుతోంది. అనంతు స్నేహితుడు చెబుతున్న ప్రకారం.. వీరి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలియదు. కానీ ఎందుకు చనిపోయారో కారణాలు తెలియలేదు. ఇటీవల ఈ ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లారు. మీనాక్షి ఇంట్లో చెప్పకుండా అతడ్ని కలిసేందుకు వచ్చింది. కొల్లాంలోని పల్కులంగర సమీపంలోని రైల్వే ట్రాకుపై ఇద్దరు ఒకరిని ఒకరు కౌగిలించుకుని పడుకున్నారు. ఆ సమయంలో ఎర్నాకులం వైపు వెళ్తున్న గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ రైలు వీరిని ఢీ కొనడంతో మరణించారు. తల్లిదండ్రులు ఇద్దరు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను ఇంట్లోవాళ్లు అంగీకరించరన్న ఉద్దేశంతో ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు, పేరెంట్స్.