iDreamPost
android-app
ios-app

కుమార్తె ఇంటికి వెళ్లిన మహిళ.. మూడేళ్ల తర్వాత షాకింగ్ న్యూస్

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు తల్లీ కూతుళ్లు, అల్లుడు. తల్లికి ఒక్కాగొనొక్క కూతురు. గారాబంగా పెంచుకుంది తల్లి. పెళ్లీడు వచ్చాక ఘనంగా పెళ్లి చేసింది. అయితే కూతుర్ని చూసేందుకు తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. అలా ఓ రోజు అల్లుడు ఇంటికి వెళ్లింది అత్త.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు తల్లీ కూతుళ్లు, అల్లుడు. తల్లికి ఒక్కాగొనొక్క కూతురు. గారాబంగా పెంచుకుంది తల్లి. పెళ్లీడు వచ్చాక ఘనంగా పెళ్లి చేసింది. అయితే కూతుర్ని చూసేందుకు తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. అలా ఓ రోజు అల్లుడు ఇంటికి వెళ్లింది అత్త.

కుమార్తె ఇంటికి వెళ్లిన మహిళ.. మూడేళ్ల తర్వాత షాకింగ్ న్యూస్

ఒకగానొక్క కూతురు. కొడుకైనా, కూతురైనా ఆమె అనుకుంది తల్లి. అల్లారు ముద్దుగా పెంచుకుంది. అడిగివనీ లేదనుకుండ అందించింది. పిల్లను పెంచి పెద్ద చేసి ఓ అయ్య చేతిలో పెట్టింది. కూతుర్ని మిస్సయ్యాయనని ఫీల్ అవుతూ.. అప్పుడప్పుడు అమ్మాయిని చూసుకునేందుకు అల్లుడు ఇంటికి వెళుతూ ఉండేది. అలాగే గత ఏడాది కూడా కూతుర్ని చూసేందుకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయింది. కూతుర్ని,అల్లుడ్ని అడిగినా.. మా ఇంటికి వచ్చి వెళ్లిపోయిందన్నారు. తల్లి ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడంతో పోలీసులకు భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె స్వగ్రామంలో విచారిస్తే.. ఆమె కూతురు ఇంటికి వెళ్లిందని చెప్పారు. పోలీసులు కూతుర్ని నిలదీయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తల్లిని చంపి ఏమీ ఎరుగని నంగనాచీలా.. పోలీసులకు ఫిర్యాదు చేసిందో కసాయి కూతురు. మూడేళ్ల తర్వాత ఆమె చేసిన నిర్వాకం బయట పడింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండ్య తాలూకాలోని హెబ్బకవాడికి చెందిన శారదమ్మకు అనూష ఏకైక కూతురు. ఒక్కత్తే కుమార్తె కావడంతో గారబంగా పెంచుకుంది. హారోహళ్లికి చెందిన దేవరాజ అనే వ్యక్తితో పెళ్లి చేసింది. పెళ్లైన తర్వాత అల్లుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేది. 2020 నవబంర్‌లో కూడా కూతురు ఇంటికి వెళ్లింది శారద. అయితే ఏదో విషయంలో తల్లి, కూతుళ్ల మధ్య గొడవ జరగడంతో శారదమ్మను తోసేసింది అనూష. దీంతో తలకు గాయమై తల్లి మరణించింది. ఈ విషయాన్ని భర్త దేవరాజకు చెప్పగా.. మృతదేహాన్ని రాత్రి పూట ఓ నిర్జన ప్రాంతంలో పడేశారు.

రెండేళ్ల వరకు ఏమీ ఎరగన్నట్లు ఉండిపోయింది. అయితే బంధువులు మీ అమ్మ ఏదీ, ఏమైందీ.. నీ దగ్గరకే వచ్చింది కదా.. అని ప్రశ్నించగా.. తన దగ్గర నుండి వచ్చేసిందని చెప్పసాగింది. అయితే అనుమానం తన పైకి వచ్చే అవకాశాలున్నాయని భావించిన అనూష.. తన భర్తతో కలిసి గత ఏడాది జూన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటికి వచ్చి వెళ్లాక.. ఆమె జాడ లేదని పేర్కొంది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్వగ్రామానికి వెళ్లి ప్రశ్నించగా.. స్థానికులు.. ఆమె కూతురి ఇంటికి వెళ్లిందని చెప్పారు. దీంతో అనమానం వచ్చిన పోలీసులు.. అనూష, దేవరాజను గట్టిగా ప్రశ్నించగా.. నిజం కక్కారు. తల్లిని నెట్టివేయడంతో చనిపోయిందని, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో పడేశానని చెప్పడంతో.. అక్కడకు వెళ్లి పోలీసులు గాలించగా.. మృతదేహం కనిపించలేదు. మూడు చోట్ల తవ్వి చూసినా జాడ కానరాలేదు. శారదమ్మ మృత దేహం ఎక్కడ పడేశారో వెతుకుతున్నారు. గారాబంగా పెంచుకున్న కూతురే తల్లిని చంపేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి